Balakrishna – Venkatesh : వెంకీమామతో బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షో గ్లింప్స్ రిలీజ్.. ఫుల్ ఏపిసోడ్ వచ్చేది అప్పుడే..

నందమూరి బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాపబుల్’(Unstopable).

Update: 2024-12-23 06:24 GMT

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాపబుల్’(Unstopable). ఇప్పటికే మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం నాలుగో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా మంచి టాక్ తెచ్చుకుంటుంది. ఇక ఇప్పటికే ఆరు ఏపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ షోకి.. ఫర్ ద ఫస్ట్ టైం విక్టరి వెంకటేష్ గెస్ట్‌గా వస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చి ఆకట్టుకున్నాయి. అయితే వెంకీమామ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వెంకీతో పాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా వచ్చారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ నుంచి ఫొటోలు రిలీజ్ చేయగా తాజాగా చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసి ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ప్రకటించారు. ఈ గ్లింప్స్ లో.. వెంకటేష్ రాగా బాలయ్య వెల్కమ్ చెప్పారు. వెంకటేష్ తొడ కొడితే, బాలయ్య వెంకీ ఆసనం వేశారు. కాగా ఈ ఎపిసోడ్‌ని డిసెంబర్ 27న రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ ఎపిసోడ్ కోసం అటు బాలయ్య ఫ్యాన్స్, ఇటు వెంకీ ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Full View
Tags:    

Similar News