Varun Dhawan: అతడి భార్య నా వెంటపడి ఇబ్బంది పెట్టింది.. వరుణ్ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బేబీ జాన్’(Baby John).
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బేబీ జాన్’(Baby John). కలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ కీర్తి సురేష్(Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే దీనిని మురాద్ ఖేతానీ(Murad Khatani), ప్రియా అట్లీ, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
భారీ అంచనాల మధ్య ‘బేబీ జాన్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. దీంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘గతంలో ఓ ఇన్సిడెంట్ ఎదురైంది. ఒక పెళ్లయిన మహిళ నా పర్మిషన్ లేకుండానే మా ఇంట్లోకి వచ్చింది. అయితే ఆమె ఓ పవర్ ఫుల్ వ్యక్తి భార్య అని తర్వాత తెలుసుకున్నా.
ఇప్పుడు ఆ వ్యక్తి పొజిషన్ ఏంటని చెప్పను కానీ తన భార్య నా వెంటపడి ఇబ్బంది పెట్టింది. తనకు నా గురించి అంతా తెలుసు అని చెప్పింది. నా కుటుంబం గురించి కూడా తెలుసు. అప్పుడు నాకు చాలా భయమేసింది. నేను తనకోసం నా కుటుంబాన్ని వదిలేస్తానని అనుకుంది. కానీ నేను పోలీసులకు చెప్పాను. అప్పుడు కూడా ఓ వ్యక్తిని తీసుకొని మా ఇంటికొచ్చింది. అప్పుడే లేడీ కానిస్టేబుల్స్(Lady Constables) వచ్చి ఆమెను తీసుకెళ్లారు. అయితే ఒకానొక సమయంలో.. ఓ లేడీ అభిమాని నాకు ఇష్టం లేకపోయినా ముద్దు కూడా పెట్టింది’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వరుణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.