నెట్టింట ఎక్కువ ట్రెండ్ అయిన క్రికెటర్స్ వీరే.. ఎవరెవరంటే..
దిశ, వెబ్‌డెస్క్: భారత దేశంలో 'క్రికెట్' అత్యంత - Virat Kohli, Rohit Sharma, MS Dhoni, CSK among most mentioned Twitter handles and hashtags in India
దిశ, వెబ్‌డెస్క్: భారత దేశంలో 'క్రికెట్' అత్యంత క్రేజ్ ఉన్న గేమ్. క్రికెట్ అంటే భారతీయులకు పిచ్చి. క్రికెట్ ప్రపంచంలో IPL T20 లీగ్ అత్యధికంగా ప్రజాదారణ పొందింది. ఇండియాలో క్రికెట్‌కు ఉన్న అసమానమైన క్రేజ్ కారణంగా క్రికెటర్లను దేవుడిలా చూస్తారు. అందుకే ఇది సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉంటుంది. టీమ్ ఇండియా ఆడినప్పుడు, ఐపీఎల్ సమయంలో ఇది మరి ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. 2021 నుండి 2022 వరకు భారతీయులు 'క్రికెట్'కు సంబంధించి దాదాపు 96.2 మిలియన్ ట్వీట్‌లు చేశారు. గత ఏడాది నుండి 2022 వరకు క్రికెట్‌కు సంబంధించిన ట్వీట్లలో, ట్విట్టర్ ఇండియా డేటా ప్రకారం.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) భారతదేశంలో అత్యధికంగా ట్రెండింగ్ జాబితాలో ఉన్నారు.
భారత క్రికెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందినవారిలో ఒకరిగా నిలిచిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఎక్కువగా ప్రస్తావించబడ్డారు. చెన్నై సూపర్ కింగ్స్, MS ధోనీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) 4వ స్థానంలో ఉండగా, ప్రస్తుత టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో స్థానంలో నిలిచాడు. రోహిత్, విరాట్ ఏడాది పొడవునా క్రికెట్ ఆడినప్పటికీ.. ధోని కేవలం ఐపీఎల్‌లో రెండు నెలల వ్యవధిలో మాత్రమే కనిపించినప్పటికీ.. జాబితాలో CSK, MS ధోనీలు ట్రెండింగ్‌లో ఉండటం ఆశ్చర్యంగా ఉంది.
2021 నుండి 2022 వరకు క్రికెట్‌లో అత్యంత ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లలో #WhistlePodu మెుదటి స్థానంలో ఉంది. తర్వాత #IPL2021, #TeamIndia ఉన్నాయి. #Yellove, #MSDhoni మొదటి ఐదు స్థానాలను పొందాయి. అత్యంత ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లలో ఆశ్చర్యకరంగా మళ్లీ.. ఐదు హ్యాష్‌ట్యాగ్‌లలో మూడు CSKకి సంబంధించినవి. చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్‌లో అన్ని IPL జట్లలో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉంది.