RC16: రామ్ చరణ్- బుచ్చిబాబు మూవీపై లేటెస్ట్ అప్డేట్.. హైప్ పెంచేస్తున్న పోస్ట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు(Buchi Babu) కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-12-25 06:15 GMT

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు(Buchi Babu) కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ సీ 16’(RC16) అనే వర్కింగ్ టైటిల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్(sukumar) రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తుండగా.. ఎఆర్ రెహమాన్(AR Rahman) స్వరాలు అందించనున్నారు. అయితే స్పోర్ట్స్ డ్రామాగా.. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. ఇక కన్నడ నటుడు శివరాజ్ కుమార్(Shivaraj Kumar), జగపతి బాబు(Jagapathi Babu) ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయనున్నారు.

కాగా ఈ సినిమాకి ‘పెద్ది’ అనే టైటిల్‌ను పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్‌ను ఇస్తూ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు(Rathnavelu) ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘ఆర్ సి 16(RC16) సినిమాలో నేను భాగమయ్యాను. రంగస్థలం(Rangasthalam) సినిమా తర్వాత రామ్ చరణ్ సినిమాకు వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం దీని షూటింగ్ మైసూర్‌లో జరగనున్నది అని తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేశారు. అలాగే మంచి టీమ్‌తో కలిసి వర్క్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమా విడుదల కోసం నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను’ అనే క్యాప్షన్‌ను జోడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Tags:    

Similar News