ఉపముఖ్యమంత్రిని కలిసిన చింతకాని గ్రామ శాఖ నాయకులు..

మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నియోజకవర్గంలోని క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2024-12-25 06:12 GMT

దిశ, చింతకాని : మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నియోజకవర్గంలోని క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం మధిర నుండి ప్రజా భవన్ కు వెళ్తుండగా చింతకాని మండల కేంద్రంలో గ్రామ శాఖ నాయకులు భట్టి విక్రమార్కకను కలిశారు. స్థానిక చింతకాని గ్రామ శాఖ నాయకులు భట్టి విక్రమార్కకి చింతకాని లోకల్ ప్రధాన రహదారి, సింగిల్ రహదారి కావటం వలన తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి, సైడ్ డ్రైన్ లేకపోవటం వలన చిన్న వాన వచ్చినా నీళ్లన్నీ రోడ్ మీదనే ప్రవహిస్తుందని తెలిపారు.

అలాగే నరసింహపురం నుండి చింతకాని దాసరి బంధం వరకు సెంట్రల్ లైటింగ్ తో రోడ్డును అభివృద్ధి చెయ్యాలని కోరారు. అదేవిధంగా చింతకాని నుండి పాతర్ల పాడు వరకు రెండు వరుసల రహదారిని మంజూరు చేయాలని, రైతులకు పెండింగ్లో ఉన్న రుణమాఫీని వెంటనే విడుదల చేయాలని భట్టి విక్రమార్కకి చింతకాని మండల నాయకులు వన్నవించారు. డిప్యూటీ సీఎం భట్టి స్పందిస్తూ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చెపిస్తానని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఖమ్మం మార్కెట్ మాజీ ఉపాధ్యక్షులు మడుపల్లి భాస్కర్, చింతకాని గ్రామ శాఖ అధ్యక్షులు అబ్దుల్ మజీద్, యండపల్లి శ్రీనివాసరావు, మల్లెల వెంకటేశ్వర్లు, వడ్రాణపు రామయ్య, తూముబిక్షం, తూము ప్రభాకర్, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Similar News