నూతన విదేశాంగ కార్యదర్శిగా వినయ్ మోహన్ క్వత్రా..
న్యూఢిల్లీ: నేపాల్‌కు భారత అంబాసిడర్‌గా వినయ్ మోహన్ క్వత్రాను కేంద్రం పదన్నోతి ఇచ్చింది.- Latest Telugu News
న్యూఢిల్లీ: నేపాల్‌కు భారత అంబాసిడర్‌గా వినయ్ మోహన్ క్వత్రాను కేంద్రం పదన్నోతి ఇచ్చింది. ఈ నెలాఖరులో పదవి విరమణ పొందనున్న విదేశాంగ కార్యదర్శిగా ఉన్న హర్షవర్ధన్ శ్రీంగ్లా స్థానంలో ఆయనను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ ఖ్వత్రా నియమాకానికి ఆమోదం తెలిపింది. 1988 భారత విదేశీ సేవ దాదాపు 32 విదేశాంగ శాఖ క్వత్రా సేవలు అందించారు. దాంతో పాటు ఫ్రాన్స్ అంబాసిడర్‌గా కూడా ఆయన పనిచేశారు. అంతేకాకుండా వాషింగ్టన్ డీసీ, జెనీవా, బీజింగ్, దక్షిణాఫ్రికాల్లోనూ ఆయన భారత్ తరఫున సేవలందించారు. ప్రధాన మంత్రి కార్యాలయంలోనూ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు.