నగరంలో అంతుచిక్కని వ్యాధి.. లక్షణాలివే..

Update: 2022-04-03 11:56 GMT

దిశ, తిరుమలాయపాలెం: మండలంలోని గోల్ తండా పంచాయతీ పరిధిలోని జింకలగూడెం గ్రామ ప్రజలు నెల రోజులకుపైగా అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారు. మొదట ఒంటి నొప్పులతో సోకె ఈ వ్యాధికి జ్వరం కూడా తోడైది. దీంతో వ్యాధిగ్రస్తులు బాడీలో ఎనర్జీ లెవెల్స్ తక్కువై నీరసంగా తయారవుతున్నారు. దీంతోపాటు వారాల తరబడి వంటి నొప్పులు వారిని తీవ్రంగా వేదిస్తున్నాయి.

భరించలేని కాళ్ళు, కీళ్ల నొప్పులతో ఈ వ్యాధి సోకిన వారు అడుగు తీసి అడుగు వెయ్యలేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు. వైద్య బృందం గతంలో అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసి పలు రకాల టెస్టులు నిర్వహించినప్పటికీ ఆ వ్యాధి లక్షణాలు బయట పడలేదు. ఆ వ్యాధి బారిన పడకుండా గ్రామ ప్రజలను వైద్య సిబ్బంది అప్రమత్తం చేసి జాగ్రత్తలు పాటించమని సూచించారు.

జిల్లా వైద్య అధికారిని మాలతి వివరణ..

దీనిపై జిల్లా వైద్య అధికారిని డాక్టర్ మాలతిని దిశ చరవాణిలో సంప్రదించగా.. అక్కడ నెలకొన్న అనారోగ్య సమస్యపై గతంలో మండల వైద్య బృందంచే జింకల గూడెం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించడం జరిగిందని అన్నారు. సోమవారం(రేపు) అక్కడ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వ్యాధిగ్రస్తుల నుండి బ్లడ్ నమూనాలను సేకరించి శాంపిల్స్ టెస్టింగ్ ల్యాబ్‌లో పరిశీలిస్తామని తెలిపారు.

Tags:    

Similar News