కర్పూరం వాసన ఆరోగ్యానికి మంచిదేనా? హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారు?

కర్పూరాన్ని భారతీయులు పూజలో ఉపయోగిస్తారు.

Update: 2024-09-20 12:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్పూరాన్ని భారతీయులు పూజలో ఉపయోగిస్తారు. పూజా కార్యక్రమాల్లో భగవంతుడికి హారతి ఇవ్వడానికి వాడే పదార్థం. ఇది మైనములా తెల్లగా ఉంటుంది. రసాయనాలతో కృత్రిమంగా తయారైన ఈ కర్పూరం ఘాటైన వాసన వచ్చే పూజా ద్రవ్యము. కర్పూరం కాంఫర్ లారెన్, సిన్నమోముం క్యాంఫొర అనే చెట్టు నుంచి లభ్యమవవుతుంది. ఈ చెట్ల ఆకులు, కొమ్మలతో కర్పూరాన్ని రెడీ చేస్తారు. దీని ఆకులు చాలా పొడవుగా ఉంటాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కర్పూర ఆకులు ఎక్కువగా రాలుతుంటాయి. ప్రతి ఏడాది అక్టోబర్ నెలలో పక్వానిక వస్తాయి. మైసూర్, మలబార్ ప్రాంతాల్లో ఈ చెట్లు కనిపిస్తాయి. నీలగిరి కొండల్లో ఎక్కువగా పెంచుతారు. ఈ చెట్లు జపాన్, చైనా దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి.

పూజ సమయంలో కర్పూరాన్ని కాల్చినప్పుడు చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయని చాలా మంది నమ్మకం. మంచి ఆలోచనలను తీసుకురావడానికి కర్పూరం సూచిస్తుంది. తీపి వాసనతో కూడిన పొగ పూజను స్వచ్ఛంగా అండ్ ప్రత్యేకంగా భావిస్తారు. అయితే కర్పూరం  వాసన ఆరోగ్యానికి మంచిదేనా? అని చాలా మందిలో సందేహాలు తలెత్తే ఉంటాయి. కాగా తాజాగా హెల్త్ ఎక్స్పర్ట్స్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం..

కర్పూరం కేవలం పూజకే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. కర్పూరం వాసన తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎసిడిటీ, అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా హెయిర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తుంది. ప్రతికూల శక్తిని తొలగిస్తుందని జ్యోతిష్య నిపుణులు తరచూ చెబుతుంటారు. కర్పూరం స్మెల్ ఆందోళన, స్ట్రెస్ ను తగ్గిస్తుంది. మానసిక సమస్యలకు చెక్ పెడుతుంది. 

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News