Memory power : చదివింది గుర్తుండట్లేదా?.. ఇలా ట్రై చేసి చూడండి!
Memory power : చదివింది గుర్తుండట్లేదా?.. ఇలా ట్రై చేసి చూడండి!
దిశ,ఫీచర్స్ : కారణాలేమైనా కొందరు పిల్లలు, పెద్దలు కూడా చదివింది గుర్తుండకపోయే సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. చదువుకునే సమయంలో ఆటంకాలు, పోషకాహార లోపం, ఆసక్తి లేకపోవడం వంటివి కూడా జ్ఞాపక శక్తి తగ్గడానికి కారణం అవుతుంటాయి. అయితే కొన్ని ట్రిక్స్ ఫాలో అవడంవల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు అంటున్నారు నిపుణులు. అదేమిటో చూద్దాం.
మానసిక నిపుణుల ప్రకారం.. తరచుగా మరిచిపోయే అలవాటు ఉన్నవారు మెమోరీ పవర్ పెరగాలంటే ‘రీకాల్ మెథడ్స్’ అనుసరించాలి. దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందుకోసం మొదటి మీరు గుర్తుంచుకోవాలనుకుంటున్న విషయాన్ని లేదా ఫస్ట్ లెటర్‌ను బాగా గుర్తంచుకునేలా ప్రాక్టీస్ చేయాలి. అలాగే విషయం గుర్తుండిపోయేందుకు మళ్లీ మళ్లీ చదువుతుండాలి. దీనివల్ల ఆ కంటెంట్ మెదడులో నిక్షిప్తమై పోతుంది. ఇక ఎక్కువ పెద్దగా, సుదీర్ఘంగా ఉండే మ్యాటర్ లేదా విషయాలు ఏవైనా త్వరగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి పదే పదే చదవే రీకాల్ పద్ధతిని అనుసరిస్తే గుర్తుండి పోతుంది.
*నోట్ :పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.