Health : ఆ సమయంలో అక్కడ నొప్పి.. దేనికి సంకేతమో తెలుసా?

Health : ఆ సమయంలో అక్కడ నొప్పి.. దేనికి సంకేతమో తెలుసా?

Update: 2024-11-27 13:52 GMT

దిశ, ఫీచర్స్ : మహిళల్లో మెన్‌స్ట్రువల్ పెయిన్ సింప్టమ్స్ ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి. కొందరికి స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్, అలసట వంటివి ఎక్కువగా ఉండవచ్చు. మరి కొందరికి రొమ్ము భాగంలో నొప్పి అధికంగా అనిపించవచ్చు. వాస్తవానికి వన్‌వీక్ ముందు నుంచే పీరియడ్స్‌కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రొమ్ములో నొప్పి రావడానికి మాత్రం ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

పీరియడ్ సమయంలో రొమ్ముల్లో నొప్పిగా అనిపించే లక్షణాన్ని వైద్య నిపుణులు ప్రీ మెన్ స్ట్రువల్ సిండ్రోమ్‌గా, దాని తీవ్రతను బట్టి ‘మాస్టాల్జియా’గా పేర్కొంటారు. హార్మోన్లలో మార్పులు, హెచ్చు తగ్గుల వల్ల ఇవి సంభవిస్తాయి. పీరియడ్స్ ముగింపు దశలో అధికం అవుతాయి. రుతక్రమ సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లలో హెచ్చు తగ్గులే ఇందుకు కారణం. ఎందుకంటే పీరియడ్ సైకిల్‌ని నియంత్రించడంలో అవి కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి మహిళలు నెలసరి సమయంలో రొమ్ము నొప్పిని ఎదుర్కొంటూ ఉంటే గనుక ఉప్పు, కారం, కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. క్యారెట్లు, అరటి పండ్లు, అవకాడోలు, పాలకూర, బ్రౌన్ రైస్ వంటివి తినడం బెటర్. దీనివల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Tags:    

Similar News