Itching: చలికాలంలో కుదుళ్లలో దురద వస్తుందా..? ఈ పొరపాట్లకు చెక్ పెట్టండి..?
సాధారణంగా ప్రతిరోజూ దాదాపు 40 (పురుషులలో 0–78) వెంట్రుకలు విశ్రాంతి దశకు చేరుకుని రాలిపోతాయి.
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ప్రతిరోజూ దాదాపు 40 (పురుషులలో 0–78) వెంట్రుకలు విశ్రాంతి దశకు చేరుకుని రాలిపోతాయి. రోజుకు 100 కంటే ఎక్కువ వెంట్రుకలు(Hair loss) రాలిపోయినప్పుడు, క్లినికల్ హెయిర్ లాస్(Clinical hair loss) ( టెలోజెన్ ఎఫ్లూవియం ) సంప్రదించవచ్చు. అయితే ప్రస్తుత రోజుల్లో తీసుకునే ఫుడ్(Food) కారణంగా కూడా హెయిర్ లాస్ అవ్వడమే కాకుండా పలు అనారోగ్య సమస్యలు(Health problems) కూడా తలెత్తుతున్నాయి.
మరికొంతమంది సరిగ్గా నూనె(oil) రాసుకోకపోవడం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంటుంది. పైగా చలికాలం(winter)లో కుదుళ్లలోని స్కిన్ పొడిబారిపోవడం(Dry skin) వల్ల చుండ్రు(dandruff) తయారవుతుంది. అంతేకాకుండా పేలు కూడా వస్తాయి. దీంతో తలలో దురద వస్తుంది. దీంతో హెయిర్ దృఢత్వాన్ని కోల్పోతుంది. కాగా ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలంటున్నారు నిపుణులు.
కొబ్బరి నూనె(coconut oil), బాదం(almond), ఆలివ్ ఆయిల్(Olive oil) వంటి నూనెల్ని వీక్లీ ఒకసారైనా పెట్టాలి. దీంతో దురద రాకుండా ఉంటుంది. హెయిర్ కూడా పట్టులా మెరుస్తుంది. అలాగే తలస్నానం చేశాక హెయిర్ పూర్తిగా ఆరిన తర్వాతే జడ వేసుకోవాలి. లేకపోతే జుట్టు కుదుళ్లలో ఇన్ఫెక్షన్(infection) వచ్చే ప్రమాదం ఉంటుంది. దురద కూడా వస్తుంది.
దురద తగ్గడమే కాకుండా పూర్తి సంపూర్ణ ఆరోగ్యం కోసం రోజూ తప్పకుండా తాజా పండ్లు(Fresh fruits) తినాలి. అలాగే కూరగాయలు(Vegetables), నట్స్(Nuts) వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. మసాజ్ చేయాలి. మసాజ్(Massaj) చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్(Blood circulation) సాఫీగా జరుగుతుంది. హెయిర్‌కు ఆయిల్ రాసుకునే ముందు కాస్త గోరువెచ్చగా వేడిచేయాలి. దీంతో దురద తగ్గుతుంది.