High Court: ఫుడ్ శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

ఫుడ్ పాయిజనింగ్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-11-27 10:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని పాఠశాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై (Food Poisoning Incidents), హైకోర్టు (High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. భోజనం వికటించిన అన్ని పాఠశాలల్లో శాంపిల్స్ సేకరించాలని ఆదేశించింది. నమూనాలను ల్యాబ్‌కు పంపించి సోమవారం వరకు పూర్తి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మాగనూరు ఘటనపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విరామం తర్వాత మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా అస్వస్థతకు గురైన పిల్లలు బయటి చిరుతిళ్లు తిన్నారని ఏఏజీ వాదనలు వినిపించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆస్పత్రికి తరలించామని తెలిపారు. బాధ్యులపైన వారిపై చర్యలు తీసుకున్నాని చెప్పారు. అధికారులపై ఏ చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News