వింత ఆచారం.. పండుగ రోజు అల్లుడిని గాడిదతో..

దిశ, ఫీచర్స్ : ఫెస్టివల్ ఆఫ్ కలర్'గా పిలువబడే హోలి పండగను దేశవ్యాప్తంగా చిన్నా, పెద్ద ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు

Update: 2022-03-18 05:07 GMT

దిశ, ఫీచర్స్ : ఫెస్టివల్ ఆఫ్ కలర్'గా పిలువబడే హోలి పండగను దేశవ్యాప్తంగా చిన్నా, పెద్ద ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. అయితే స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా సెలబ్రేషన్స్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఈ మేరకు కొన్ని ఆచారాలు ఆనందాన్ని రెట్టింపు చేసేలా ఉంటే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇదిలా ఉంటే మహారాష్ట్ర, బీడ్ జిల్లాలోని ఓ గ్రామంలో శతాబ్ద కాలం నుంచి ఒక విచిత్రమైన సంప్రదాయం కొనసాగుతోంది. దీని ప్రకారం గ్రామంలోని 'కొత్త అల్లుడు' హోలి రోజున గాడిదపై స్వారీ చేయాల్సి ఉంటుంది.

ఏమిటి ఈ ఆచారం?

ఔరంగాబాద్ నుంచి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో జరిగే హోలి వేడుకల కోసం గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మూడు, నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఆ గ్రామానికి చెందిన కొత్త అల్లుడిని గాడిదపై స్వారీ చేయిస్తారు. అంతేకాదు ఈ ఘట్టం నుంచి అతను తప్పించుకోకుండా ఉండేందుకు గ్రామస్తులంతా కాపు కాస్తుంటారు కూడా. ఇక గ్రామం నడిబొడ్డు నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే రైడ్.. చివరకు హనుమాన్ టెంపుల్ వద్ద కొత్త అల్లునికి బట్టలు బహూకరించడం ద్వారా ముగుస్తుంది. కాగా స్థానికులు దైవంగా కొలుచుకునే ఆనందరావు దేశ్‌ముఖ్ అనే వ్యక్తి ఈ సంప్రదాయాన్ని మొదలుపెట్టినట్లు తెలుస్తుండగా.. ముందుగా అతని అల్లుడితోనే ప్రారంభించడం విశేషం.

Tags:    

Similar News