తగ్గుతున్న నిరుద్యోగ రేటు!

కోల్‌కతా: దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాధారణ - Unemployment rate decreasing in India: CMIE

Update: 2022-04-03 14:23 GMT

కోల్‌కతా: దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్న తరుణంలో నిరుద్యోగ రేటు తగ్గుతోందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిరుద్యోగ రేటు 8.10 శాతం నుంచి మార్చి నాటికి 7.6 శాతానికి దిగొచ్చిందని సీఎంఐఈ తెలిపింది. ఏప్రిల్ 2వ తేదీ నాటికి మరింత పడిపోయి 7.2 శాతానికి చేరుకుందని, ఇందులో పట్టణ నిరుద్యోగం 8.5 శాతం ఉండగా, గ్రామీణంలో 7.1 శాతమని వివరించింది. మునుపటి కంటే నిరుద్యోగం తగ్గుతున్నప్పటికీ భారత్ లాంటి పేద దేశంలో ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ రేటు చాలా ఎక్కువే అని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ రిటైర్డ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ అభిరూప్ సర్కార్ అన్నారు.


నిరుద్యోగ రేటు తగ్గిపోవడం చూస్తే రెండేళ్ల పాటు కొవిడ్-19 సంక్షోభం నుంచి బయటపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ, నిరుద్యోగం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు దొరికిన పని చేస్తూ ఉపాధిని వెతుక్కుంటున్నారని అభిరూప్ సర్కార్ వివరించారు. సీఎంఐఈ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా హర్యానా లో 26.7 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. దీని తర్వాత రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లలో 25 శాతం చొప్పున, బిహార్‌లో 14.4 శాతం, త్రిపురలో 14.4 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 5.6 శాతం నిరుద్యోగ రేటు ఉంది. ఈ జాబితాలో అతి తక్కువగా కర్ణాటక, గుజరాత్‌లు 1.8 శాతంతో చివర్లో ఉన్నాయి.

Tags:    

Similar News