AP High Court: మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు హైకోర్టులో చుక్కెదురు
హత్య కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా(Ex Minister Dadishetti Raja)కు హైకోర్టు(High Court)లో చుక్కెదురైంది.
దిశ, డైనమిక్ బ్యూరో: హత్య కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా(Ex Minister Dadishetti Raja)కు హైకోర్టు(High Court)లో చుక్కెదురైంది. ఉన్నత న్యాయస్థానం బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. ఐదు సంవత్సరాల క్రితం తుని(Thuni) నియోజకవర్గంలో హత్యకు గురైన ఆంధ్రజ్యోతి(Andhra Jyothi) విలేకరి కాతా సత్య నారాయణ(Kata Sathyanatayana) కేసులో దాడిశెట్టి రాజాపై పోలీసులు ఇటీవల మరోసారి కేసు నమోదు చేశారు. దీంతో ఆయన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు రాజా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.
కాగా తుని నియోజకవర్గం తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరిగా ఉన్న కాతా సత్యనారాయణను 2019 అక్టోబర్ 15న లక్ష్మీదేవి చెరువు గట్టు వద్ద కొందరు దుండగులు అడ్డగించి కత్తులతో నరికి చంపారు(Murder). ఈ హత్యకు పన్నాగం పన్నింది దాడిశెట్టి రాజా అని మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాజా మంత్రి అయ్యాక ఈ కేసులో విచారణ ముందుకు సాగకపోగా.. 2023 లో కేసు నుంచి రాజా పేరును తప్పించారు. దీంతో నిందితులను శిక్షించాలని మృతుని కుటుంబసభ్యులు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, హైకోర్టు, ఎన్‌హెచ్ఆర్సీ లకు ఫిర్యాదులు అందజేశారు. ఇక దీనిపై కూటమి ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటామని నారా లోకేశ్ సైతం భరోసా ఇచ్చారు. దీంతో కూటమి అధికారంలోకి వచ్చాక దాడిశెట్టి రాజాపై తుని పోలీసులు కేసు నమోదు చేశారు.