YS Jagan:తల్లితో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ సీఎం

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan) నాలుగు రోజులు కడప జిల్లా(Kadapa District) పర్యటనలో భాగంగా ఇవాళ(బుధవారం) పులివెందుల(Pulivendula) సీఎస్‌ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్(Christmas) వేడుకల్లో పాల్గొన్నారు.

Update: 2024-12-25 08:18 GMT

దిశ,వెబ్‌డెస్క్: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan) నాలుగు రోజులు కడప జిల్లా(Kadapa District) పర్యటనలో భాగంగా ఇవాళ(బుధవారం) పులివెందుల(Pulivendula) సీఎస్‌ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్(Christmas) వేడుకల్లో పాల్గొన్నారు. CSI చర్చికి చేరుకున్న వైఎస్ జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే.. వైఎస్ కుటుంబంలో ఆస్తుల కేసు తెరపైకి వచ్చిన తర్వాత తల్లి విజయమ్మ(YS Vijayamma)తో జగన్ కలిసిన సందర్భాలు కనిపించలేదు. కానీ క్రిస్మస్‌ వేడుకలు ఆ తల్లీ కుమారులను కలిపింది.

ఇడుపులపాయ ప్రేయర్‌ హాల్‌లో జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో వైఎస్‌ విజయమ్మ, జగన్‌ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తల్లి విజయమ్మ చేయి పట్టుకొని కేక్ కట్ చేయించారు. కుమారుడిని దగ్గరకు తీసుకొని తల్లి విజయమ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు. జగన్‌తో పాటు కుటుంబ సభ్యులు సైతం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రేపు, ఎల్లుండి కూడా వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. క్రిస్మస్ వేడుక(Christmas celebration)ల్లో పాల్గొన్న వైఎస్ జగన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

Tags:    

Similar News