ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు.. ఆ నినాదాలతో మార్మోగిన ఆలయం

దుర్గాదేవిని దర్శించుకునేందుకు భవానీలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఓం టర్నింగ్ నుంచి అమ్మవారి సన్నిధానం వరకు క్యూలైన్‌లో భక్తులు, భవానీలు వేచి ఉన్నారు.

Update: 2024-12-25 08:38 GMT

దిశ ప్రతినిధి,ఎన్టీఆర్ జిల్లా: దుర్గాదేవిని దర్శించుకునేందుకు భవానీలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఓం టర్నింగ్ నుంచి అమ్మవారి సన్నిధానం వరకు క్యూలైన్‌లో భక్తులు, భవానీలు వేచి ఉన్నారు. ఇరుముడి శిరస్సున ధరించి అమ్మవారిని దర్శించుకొని భవానీలు తమ దీక్షను విరమిస్తున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న భవాని దీక్షలు నేటితో ఘనంగా ముగిశాయి. కనక దుర్గాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భవాని మాలాధారణలో భక్తులు తరలివస్తున్నారు.

ఇక, ఉత్తరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున కాలినడకన ఇంద్రకీలాద్రికి భవానీల రాకతో ఇంద్రగిరులన్నీ ఎరుపెక్కాయి. జై దుర్గా.. జై జై దుర్గా నినాదాలతో ఆలయం మార్మోగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో భారీగా భవానీలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్ద ఎత్తున భవానీల రాకతో. ముందుగానే అధికారులు దానికి అనుగుణంగా విస్తృత ఏర్పాటు చేశారు. భవానీలు కొండపైకి వచ్చి అమ్మవారి దర్శనం తర్వాత మాల విరమణ కోసం వచ్చే భవానీల కోసం మల్లికార్జున మండపం దగ్గర అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 45 రోజుల పాటు సాగిన కఠోర దీక్ష భవానీలు అమ్మవారి దర్శనం అనంతరం పవిత్రమైన హోమగుండం వద్ద దీక్షను విరమించారు. ప్రశాంతంగా దీక్షలు ముగిసాయి, దీంతో పోలీస్, రెవెన్యూ, దేవస్థానం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


Similar News