School Holidays:విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవుల్లో మార్పులు

ఏపీలోని విద్యార్థులకు ప్రభుత్వం(AP Government) బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల్లో మార్పులు ఉండనున్నాయి.

Update: 2024-12-25 07:56 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని విద్యార్థులకు ప్రభుత్వం(AP Government) బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల్లో మార్పులు ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ 2024-2025 ప్రకారం పండుగ హాలిడేస్(Holidays) జనవరి 10-19 తేదీల్లో ఉంటాయని విద్యాశాఖ గతంలో పేర్కొంది. కానీ ఇటీవల భారీ వర్షాలతో(Heavy rains) చాలా జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవులు ఇచ్చారు. దీంతో పనిదినాలు తగ్గొద్దంటే ఈ సెలవులు తగ్గించాలి. ఈ సారి 11-15 లేదా 12-16 తేదీల్లో పొంగల్ హాలిడేస్ ఉండొచ్చని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

ఇదిలా ఉంటే.. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌‌ను ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. విద్యార్థులు మెరుగ్గా ప్రీపేర్‌ అయ్యేందుకు, ఒత్తిడి(stress)ని తగ్గించేందుకు రోజు విడిచి రోజు ఉండేలా పరీక్షల షెడ్యూల్‌ను(Exam Shedule) రూపొందిచారు. దీనివల్ల విద్యార్థులు పరీక్షల్లో ప్రతిభను కనబరచడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News