Tea and heath : అలవాటుకొద్దీ టీ తాగుతుంటాం కానీ..!

Tea and heath : అలవాటుకొద్దీ టీ తాగుతుంటాం కానీ..!

Update: 2024-11-05 08:31 GMT

దిశ, ఫీచర్స్ : ఉదయం లేవగానే టీ తాగనిదే చాలా మందికి పొద్దు గడవదు. అలా చేస్తేనే రిలాక్స్‌గా, రీఫ్రెష్‌గా ఉంటుందని భావిస్తారు. అంతేకాకుండా రోజు మొత్తంలో ఐదారుసార్లు టీ, కాఫీ వంటి పానీయాలు తాగేవారు కూడా ఉంటారు. వాస్తవానికి కాఫీ గింజల్లో ఎనర్జీ లెవల్స్ పెంచే పోషకాలు ఉంటాయి. అయితే టీ, కాఫీ రెండింటిని కూడా మితంగా తాగితేనే మంచిది. అయితే రాత్రి ఏడుగంటల తర్వాత టీ తాగే అలవాటు పలు అనారోగ్యాలకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

తలనొప్పి, ఛాతీలో మంట

సాధారణంగా టీ తాగడంవల్ల తలనొప్పి తగ్గుతుందని చెప్తారు. ఎక్కువసార్లు తాగడం, రాత్రి పూట తాగడం వల్ల కొందరిలో గ్యాస్ ఫామ్ అయి కడుపులో ఉబ్బరం, కడుపు నొప్పి, తలనొప్పి వంటివి ఏదో ఒకటి తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా కాఫీ, టీలోని సమ్మేళనాలు ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ వంటి రిస్క్‌ను పెంచుతాయి. ఛాతీలో మంట, వికారం వంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి.

నిద్రలేమి, డీహైడ్రేషన్

రాత్రి పూట టీ తాగడంవల్ల అందులోని కెఫిన్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. క్రమంగా నిద్రలేమికి, తద్వారా ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. దీంతోపాటు బాడీలో డీహైడ్రేషన్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇది తలనొప్పి, అలసట, ఏకాగ్ర కోల్పోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది.

హార్ట్ రేట్ పెరుగుతుంది!

టీలోని కెఫిన్ కంటెంట్ హార్ట్ రేట్‌ను ప్రభావితం చేస్తుంది. కాబట్టి రాత్రిపూట తాగడంవల్ల మీ హృదయ స్పందన రేటు సాధారణంటే అధికంగా ఉండే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి గుండె జబ్బులు ఉన్నవారైతే రాత్రి ఏడింటి తర్వాత టీ, కాఫీలు అసలు తాగకపోవడమే మంచిది.

*గమనిక : పైవార్త లోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News