గే, ట్రాన్స్‌జెండర్, లెస్బియన్.. మీకు భాగస్వామిగా ఎవరు కావాలి..?

మీలో ఎంతమందికి? గే, ట్రాన్స్‌జెండర్, లెస్బియన్.. ఈ మూడింటి మధ్య తేడా తెలుసు..? ఈ మూడూ ఒకటేనా..? లేదా ఏమైనా తేడా ఉన్నాయా..?

Update: 2024-12-26 14:43 GMT

మీలో ఎంతమందికి? గే, ట్రాన్స్‌జెండర్, లెస్బియన్.. ఈ మూడింటి మధ్య తేడా తెలుసు..? ఈ మూడూ ఒకటేనా..? లేదా ఏమైనా తేడా ఉన్నాయా..? ఈ మూడు మాత్రమే కాకుండా.. ఇంకా ఎన్ని జెండర్స్ మన చుట్టూ ఉన్నాయి..? వాళ్లు కూడా రిలేషన్స్‌లోకి వెళ్తారా..? సెక్స్ చేసుకుంటారా..? పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కంటారా..?

నేను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్న నాన్నా.. అని ఓ కూతురు చెబితేతో, నేను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్న నాన్నా అని కొడుకు చెబితేనో.. కోప్పడే రోజుల నుంచి ఇప్పుడు.. నేను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నా అని కొడుకు.. నేను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నా అని కూతురు చెప్పే సిట్యుయేషన్‌కి వచ్చేశాం.

దిశ, వెబ్‌డెస్క్ :హైదరాబాద్‌కి చెందిన ఎక్స్ అనే పర్సన్. బెంగళూరుకు చెందిన వై అనే పర్సన్.. ఆన్‌లైన్‌లో మీట్ అయ్యారు. వాళ్ల మధ్య అనుకోకుండా పరిచయం పెరిగి.. అది ప్రేమగా మారింది. ఆ ప్రేమని పెద్దలు, సమాజం అంగీకరించలేదు. కానీ వాళ్లందరినీ ఎదిరించి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరికీ ఇద్దరు పిల్లలు. ఈ కథ 90s మూవీ స్టోరీలా ఉంది కదా. బట్.. ఇది 2024 స్టోరీనే. చిన్న ట్విస్ట్ ఏంటంటే.. ఎక్స్ పేరు శ్రీను. వై పేరు రవి. మీరు విన్నది కరెక్టే. వీళ్లిద్దరే ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇండియాలో ఈ గే మ్యారేజ్ ట్రెండ్ పెరుగుతోంది. సుప్రీం కోర్టు కూడా వీళ్ల రిలేషన్స్‌కి అడ్డు చెప్పే 377 ఆర్టికల్‌ని తీసేయడంతో ఇక వీళ్లంతా హ్యాపీగా ఒక్కటైపోతున్నారు. కానీ ఈ టైప్ ఆఫ్ మ్యారెజెస్‌కి మన దేశంలో మాత్రం వ్యతిరేకంగా ఉంటున్నారు జనాలు. ఇది భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని ఫైట్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎవరిది కరెక్ట్..? గే మ్యారేజెస్ కరెక్టేనా..? లేక ఇది నిజంగా భారతీయ సంస్కృతిని దెబ్బతీస్తాయా..? అసలు కోర్టులు ఏమంటున్నాయి? ఇండియాలోనే కాకుండా.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం జరుగుతున్న జెండర్ వార్‌ స్టోరీ ఏంటి?

చైతన్య మిశ్రా అండ్ అభిషేక్ రే.. ఇండియాలో పెద్ద ఫంక్షన్ చేసి మరీ పెళ్లి చేసుకున్న గే కపుల్ వీళ్లు. వీళ్లిద్దరికీ 2020లో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఆ తర్వాత ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ కలకత్తాలో హిందూ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్నారు. లాయర్లైన వీళ్లిద్దరూ ఎల్‌జీబీటీక్యూఐ ప్లస్ జెండర్ల వాళ్ల హక్కుల కోసం కోర్టుల్లో పోరాడుతుంటారు.

అమిత్ షా, అదిత్య మదిరాజు ఇద్దరూ యూఎస్‌లో ఉంటారు. తెలుగోడైన ఆదిత్యకి, నార్త్ అబ్బాయి అమిత్ షాకి 2016లో ఓ మ్యూట్యువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత వీళ్లిద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ మొదలైంది. ఇద్దరూ గేస్ కావడంతో హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం యూఎస్‌లోనే పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీళ్లకి వాళ్ల పేరెంట్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ దొరికింది. ఈ మధ్యనే అమిత్ షా, ఆదిత్యత్యలకి ఓ పాప కూడా పుట్టింది. అదెలా? అని మాత్రం అడక్కండి.

వీళ్లిద్దరే కాదు.. వీళ్లలా ఇంకా ఎంతోమంది గే, లెస్బియన్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. కానీ ఇండియా చట్టాల ప్రకారం.. సేమ్ జెండర్ మ్యారేజెస్‌కి చట్టబద్ధత లేదు. 2018లో సేమ్ జెండర్ రిలేషన్‌షిప్స్‌‌ని క్రిమినలైజ్ చేసే ఐపీసీ సెక్షన్ 377.. వ్యక్తిగత స్వేచ్ఛకి వ్యతిరేకం అని చెప్పి సుప్రీం కోర్టు తీసేయడంతో వీళ్లకి భారీ సపోర్ట్ దొరికినట్లైంది. కానీ వీళ్ల మ్యారేజ్‌కి మాత్రం ఇప్పటికీ మన దేశంలో లీగాలిటీ లేదు. 2023లో పెళ్లికి కూడా చట్టబద్ధత ఇవ్వాలని కొంతమంది కోర్టుకెక్కినా.. పెళ్లి అనేది ప్రాథమిక హక్కు కిందకి రాదని చెప్పి ఆ పిటిషన్‌ని కొట్టేసింది. అయితే సుప్రీం కోర్టు తీర్పును కూడా దాదాపు 53 శాతం మంది ఇండియన్ యూత్ విమర్శించారని ఫ్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వేలో తేలింది. అంటే వాళ్లంతా సేమ్ జెండర్ మ్యారేజెస్‌కి సపోర్ట్‌గా ఉన్నట్లే మనం అనుకోవచ్చు. ఇక ఇండియాలో సేమ్ జెండర్ మ్యారేజ్ ఇల్లీగల్ కాబట్టి ఎంతమంది ఇలాంటి రిలేషన్స్‌లో ఉన్నారో చెప్పడం కష్టం. కానీ గత 10 ఏళ్లలో మన దేశంలో ఈ తరహా సేమ్ జెండర్ రిలేషన్స్ పెరిగిపోయాయని, ప్రస్తుతం ఇండియాలో దాదాపు 17 శాతం మంది హోమోసెక్సువల్స్ ఉన్నారని ఇప్‌సోస్ (IPSOS) లాంటి రీసెర్చ్ సంస్థల సర్వేల్లో తేలింది.

ఇంటర్నేషనల్ రేంజ్‌లో కూడా ఈ మధ్య కాలంలో ఈ సేమ్ జెండర్ మ్యారేజెస్ ఎక్కువయ్యాయి. 2022లో చేసిన ఓ సర్వేలో ఒక్క అమెరికాలోనే 1.2 మిలియన్లు అంటే 12 లక్షల సేమ్ జెండర్ కపుల్స్ ఉన్నారట. వాళ్లంతా హ్యాపీగా ఒకే ఇంట్లో ఉంటున్నారట. ఇక వాళ్లలో 58 శాతం మంది పెళ్లిళ్లు కూడా చేసుకున్నారట. ఇండియాలో సేమ్ జెండర్ మ్యారేజెస్‌కి పర్మిషన్ లేదు కానీ.. పెరుగుతున్న సపోర్ట్ చూసిన చాలా దేశాలు ఈ సేమ్ జెండర్ మ్యారేజెస్‌ని ఎలో చేస్తున్నాయి. 2024 వరకు దాదాపు 36 దేశాలు ఈ తరహా పెళ్లిళ్లకు తమ దేశంలో లీగల్ స్టేటస్ ఇచ్చేశాయి.

అయితే మనదేశంలో ఈ పెళ్లిళ్లని ఎందుకు లీగలైజ్ చేయడం కుదరడం లేదు.. అనే విషయంపై ఫోకస్ చేస్తే.. మిగిలిన ఫారెన్ కంట్రీస్‌తో పోల్చితే మన దేశంలో రూట్ వ్యాల్యూస్.. అంటే సాంస్కృతికంగా, సంప్రయదాయపరంగా మన దేశం చాలా శతాబ్దాల నుంచి కొన్ని విధానాలని ఫాలో అవుతూ వస్తోంది. అది తప్పా..? కరెక్టా..? అనేది పక్కన పెడితే.. ప్రజలు ఇంకా వాటినే ఫాలో అవడానికి ఇష్టపడుతున్నారు. దానివల్లే ఈ సేమ్ జెండర్ మ్యారేజెస్‌ని సపోర్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఫన్నీ థింగ్ ఏంటంటే.. టిపికల్ ఇండియన్ ఫ్యామిలీస్‌లో అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డా.. అమ్మాయి అబ్బాయిని ఇష్టపడ్డా కూడా ఒప్పుకోరు. అదేంటో.

సరే.. మనం ఇప్పటివరకు సేమ్ జెండర్ మ్యారేజ్ గురించి మాట్లాడుకున్నాం.. అయితే అసలు జెండర్స్‌ని డిఫైన్ చేసే ఎల్‌జీబీటీక్యూఐఏ ప్లస్ (LGBTQIA plus).. అంటే ఏంటి..? ఎల్ అంటే లెస్బియన్, జీ అంటే గే, బీ అంటే బై సెక్సువల్, టీ అంటే ట్రాన్స్‌జెండర్, క్యూ అంటే క్వీర్, ఐ అంటే ఇంటర్‌సెక్సువల్, ఏ అంటే అసెక్సువల్, ఇక ప్లస్ అంటే ఇలాంటివి ఇంకా ఉన్నాయని. ఓ అంచనా ప్రకారం.. ఇలాంటి 64 వరకు జెండర్స్ ఉన్నాయట.

ఇక మన దేశంలో ఈ సేమ్ జెండర్ మ్యారేజెస్‌కి జనాలు ఒప్పుకోకపోవడానికి కారణం మన దగ్గర జనాలు సైంటిఫికల్‌గా ఆలోచించలేకపోవడమే అనేది కొంతమంది సైంటిస్టుల మాట.

మన దేశంలో ఇప్పటికీ సగానికి పైగా జనాలకి జెండర్స్ అంటేనే తెలీదు.. ఇక ఎల్‌జీబీటీక్యూఐఏ ప్లస్ అంటే ఏం తెలుస్తుంది. అంతెందుకు.. గే, లెస్బియన్, ట్రాన్స్‌జెండర్.. వీళ్ల మధ్య ఉన్న తేడా కూడా తెలీదు. ఒకవేళ కొడుకులో ఏ మాత్రం స్త్రీ లక్షణాలు కనిపించినా వాడిని హిజ్రా అని ముద్ర వేసి ఇంటి నుంచి తరిమేస్తారు. కొంతమంది చంపేస్తారు కూడా. కానీ ఇప్పుడు మన దేశంలో కూడా జనాలు మారిపోతున్నారు. పిల్లల్లో ఇలా సేమ్ జెండర్ ఎట్రాక్షన్‌ని గమనిస్తే.. వాళ్లని ఇబ్బంది పెట్టకుండా సపోర్ట్ చేస్తున్నారు.

Read More : Illegal Affairs: అక్రమ సంబంధాల్లో దుమ్మురేపిన లేడీస్.. ఆ రాష్ట్రం మహిళలే టాప్


Similar News