Collagen: కొల్లాజెన్ సహజంగా పెరగాలా.. న్యూట్రషనిస్ట్ చెప్పిన బెస్ట్ చిట్కాలు పాటించండి
కొల్లాజెన్(Collagen) అనేది మీ శరీరంలో అతి ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్స్‌లో ఒకటి.
దిశ, వెబ్‌డెస్క్: కొల్లాజెన్(Collagen) అనేది మీ శరీరంలో అతి ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్స్‌లో ఒకటి. ఇది చర్మం ఆకృతి, నిర్మాణం, మృదుత్వాన్ని పెంచడంలో మేలు చేస్తుంది. దీంతో మీ చర్మం యవ్వనంగా మెరిసిపోతుంది. ఇది మృదులాస్థి, స్నాయువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తోడ్పడుతుంది. శరీర కణాలను ఒకదానితో ఒకటి అతుక్కుని ఉంచే కనెక్టివ్ టిష్యూ వంటి ఈ కొల్లాజెన్ ఉత్పత్తిని సహజంగా పెంచే మార్గాలేంటో తాజాగా నిపుణులు వివరించారు.
కొల్లాజెన్ బోన్స్(Bones), కీళ్ల ఆరోగ్యాన్ని(Joint health), కణజాలలకు బలం సాగే స్థితిని, కండరాల పరిమాణాన్ని మెరుగుపర్చడంలో మేలు చేస్తుంది. అంతేకాకుండా పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో, వాపును తగ్గించడం(Reducing inflammation)లో సహాయపడుతుంది. అయితే కొల్లెజెన్ వయసుతో పాటు తగ్గుతూ వస్తుంది. తర్వాత కీళ్ల నొప్పులు, ముడతలు పలు సమస్యలకు దారితీస్తుంది. కాగా దీనికి పరిష్కారం కొల్లాజెన్ అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవడమే అంటున్నారు నిపుణులు.
కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి(Vitamin C) అవసరం. కాగా ఆకుపచ్చ రంగు బెల్ పెప్పర్స్(Green bell peppers), కొత్తిమీర(Coriander), క్యాప్సికమ్(Capsicum) వంటి ఆహారాల్లో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో చర్మానికి విటమిన్ సి అందుతుంది.
అలాగే గ్రీన్ టీ(Green tea), దాల్చిన చెక్క(Cinnamon), బ్లూబెర్రీస్(Blueberries) వంటి ఆహారాల్లో యాంటీయాక్సిడెంట్లు(Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా కనిపించేందుకు సహాయపడతాయి.
విటమిన్ ఎ (Vitamin A) అధికంగా ఉండే ఆహారాలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో మేలు చేస్తాయి. గుమ్మడికాయ(pumpkin), బచ్చలికూర(Spinach), చేప నూనె(fish oil), క్యారెట్లు(carrots), జంతువుల కాలేయం(animal liver) వంటి తీసుకోవాలి.
కొల్లాజెన్ ఉత్పత్తికి జెన్సెంగ్ టీ(Ginseng tea) మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants) అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రంధ్రాలను తొలగించడంలో, ఇన్ఫ్లమేషన్ నియంత్రించడం(Controlling inflammation)లో తోడ్పడుతుంది. స్కిన్ యవ్వనంగా తయారవుతుంది.