Ladies Illegal Affairs: అక్రమ సంబంధాల్లో దుమ్మురేపిన లేడీస్.. ఆ రాష్ట్రం మహిళలే టాప్
నేటికాలంలో రోజురోజుకు అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. యువతీయువకులే కాకుండా వివాహితులు ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకోవడంలో ముందుంటున్నారు.
దిశ, వెబ్‌డెస్క్ : నేటికాలంలో రోజురోజుకు అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. యువతీయువకులే కాకుండా వివాహితులు ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకోవడంలో ముందుంటున్నారు. అయితే మగవారే ఎక్కువగా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారనే ప్రచారం ఉంది. కానీ మహిళలే పురుషుల కంటే ఎక్కువ మందితో శృంగార సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది. వినడానికి వింతగా ఉన్నా.. NFHS-5 (National Family Health Survey)లో ఈ షాకింగ్ నిజం తెలిసింది. దేశ వ్యాప్తంగా చేసిన ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ రాష్ట్ర మహిళలు శృంగార ప్రియురాళ్లు..
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే దేశంలోని 8 కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు 28 రాష్ట్రాల్లోని 707 జిల్లాల్లో సర్వే చేపట్టింది. 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న 1.1 లక్షల మంది స్త్రీ, లక్ష మంది పురుషుల నుంచి రహస్యంగా సర్వే వివరాలను సేకరించింది. ఈ సర్వేలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మందితో సెక్స్ చేసినట్లు తెలిపారు. స్త్రీలు సగటున 3/1 వంతున వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు వెల్లడైంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని స్త్రీలు సగటున 7 శాతం కంటే ఎక్కువగా, పురుషులు 4 శాతం ఇల్లీగల్ ఎఫైర్‌లో ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఇక దేశంలో రాజస్థాన్‌కు చెందిన మహిళలు అత్యధికంగా అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారు. ఆ రాష్ట్ర మహిళలు సగటున 8/1 శాతం ఎఫైర్లు కొనసాగిస్తున్నారు. తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, చండీగఢ్, హర్యానా, లక్షద్వీప్, పుదుచ్చేరి, లఢక్, జమ్మూ, కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన మహిళలు 4 శాతం, పురుషులు కేవలం 0.5 శాతం వివాహేతర సంబంధాలు నెరుపుతున్నారు.
శృంగారంలో రెండేళ్లు ముందున్న గ్రామీణ మహిళలు
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో మరో షాకింగ్ విషయం బయటపడింది. సెక్స్ కోరికలు తీర్చుకోవడంలో పట్టణ మహిళలకంటే గ్రామీణ స్త్రీలు ముందున్నారని సర్వేలో తేటతెల్లం అయింది. విలేజ్ యువతులు 18 ఏళ్లకు, టౌన్ అమ్మాయిలు 20 ఏళ్లకు సెక్స్ చేస్తారని తెలిపింది. ఫస్ట్ సెక్స్ ఏ వయసులో జరిగిందని 25 నుంచి 49 ఏళ్ల వయసు మహిళలను అడగ్గా.. 10 శాతం మంది తాము 15 సంవత్సరాల వయసులోనే శృంగారాన్ని ఆస్వాదించామని వెల్లడించారు. అంతే కాదు 60 శాతం మంది తాము భర్తతో కాకుండా పరాయి పురుషులతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నామని చెప్పారు. పెళ్లికి ముందే శృంగార అనుభవంపై 15 నుంచి 24 ఏళ్ల లోపు యువతులను ప్రశ్నించగా.. 2 నుంచి 3 శాతం మంది యువతులు సెక్స్ చేసినట్లు పేర్కొన్నారు. కానీ పురుపుల్లో 0.5 నుంచి 0.9 శాతం మందే వివాహానికి ముందు శృంగారంలో పాల్గొన్నట్లు వెల్లడించారు.
షాకిస్తున్న అబార్షన్ల సంఖ్య
శృంగారం సమయంలో సెఫ్టీ పద్ధతులు పాటించకపోవడం, సెక్స్‌పై సరైన అవగాహన లేకపోవడంతో అవాంఛీత గర్భాలు వస్తున్నాయి. కొంత బాలికలు కౌమర దశలోనే పాఠశాల ఏజ్‌లో శృంగారంలో పాల్గొన్నట్లు వెల్లడించారు. 12 ఏళ్ల వయసున్న అబ్బాయిలూ వేశ్యలతో కోరికలు తీర్చుకున్నట్లు తెలిపారు. 53 శాతం మంది అమ్మాయిలు ప్రైవేట్ హెల్త్ సెక్టార్‌లో అబార్షన్లు చేయించుకున్నాం అని చెప్పగా.. 20 శాతం మంది పబ్లిక్ సెక్టార్లో చేయించుకున్నట్లు వెల్లడించారు. ఇక 27 శాతం మంది మహిళలు తాము ఇళ్లలోనే గర్భస్రావం చేసుకున్నామన్నారు. సెక్స్ సమయంలో కండోమ్స్ వాడుతామని 51 శాతం మంది పురుషులు తెలిపినట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది.
Read More : గే, ట్రాన్స్‌జెండర్, లెస్బియన్.. మీకు భాగస్వామిగా ఎవరు కావాలి..?