Lung health : శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులా..? బయటపడే మార్గమిదిగో..

Lung health : శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులా..? బయటపడే మార్గమిదిగో..

Update: 2024-12-26 08:34 GMT

దిశ, ఫీచర్స్ : ఆస్తమా, గుండె జబ్బులు వంటివి ఉన్నవారికి చలికాలంలో ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటప్పుడు ఆందోళన, ఒత్తిడి వంటివి కూడా పెరుగుతాయి. అలాంటప్పుడు ఇబ్బందుల నుంచి బయట పడాలంటే బ్రీతింగ్ వ్యాయామాలు చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం.

*ఊపిరి తిత్తులు బలహీనంగా మారి శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటే గనుక శ్వాసను లోతుగా పీల్చి వదిలేయడం వంటి వ్యాయామాలు ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల లంగ్స్ బలంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు రక్తాన్ని సరఫరా చేసే సామర్థ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఊపిరి తిత్తులకు, మొత్తం శరీరానికి ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరుగుతుంది. దీంతో శ్వాసకోశ వ్యాధుల రిస్క్ తగ్గుతుంది.

*శ్వాస వ్యాయామాలు పారా సింపథెటిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తాయి కాబట్టి.. ఒత్తిడి, ఆందోళన, అధిక రక్తపోటు వంటివి తగ్గిపోతాయి. తద్వారా గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శ్వాసపరమైన ఇబ్బందులను నివారించడమే కాకుండా మెరుగైన జీర్ణక్రియకు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు సహాయపడతాయి. యోగా, మెడిటేషన్, లోతైన శ్వాస వంటివి ప్రాక్టీస్ చేసేవారిలో దీర్ఘకాలిక నొప్పులు, కండరాల వాపు, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయని, మానసిక ప్రశాంతత చేకూరి అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Read More...

Health : చలికాలం కదా అని బయట తిరగడం మానేస్తే..? మీ శరీరంలో జరిగే మార్పులివే..


Tags:    

Similar News