Government Advisor : మంత్రిని కలిసిన ప్రభుత్వ సలహాదారు..
తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను ప్రభుత్వ సలహాదారు మొహ్మద్ అలీ షబ్బీర్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
దిశ, మాచారెడ్డి : తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను ప్రభుత్వ సలహాదారు మొహ్మద్ అలీ షబ్బీర్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కావాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. మంత్రి వెంటనే స్పందిస్తూ 20 కోట్ల సీఆర్ఆర్ నిధులు మంజూరు చేశారు. అడిగిన వెంటనే కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించిన మంత్రి సీతక్కకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.