డ్రైవర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

నగరంలోని నెహ్రూ పార్క్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2024-12-25 15:47 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ డిసెంబర్ 25: నగరంలోని నెహ్రూ పార్క్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సారంగపూర్ గ్రామానికి చెందిన పల్లె సవిత (52) బీడీ కార్మికురాలు తన వ్యక్తిగత పనుల కోసం నగరానికి వచ్చింది. తన పనులు ముగించుకుని తిరుగు ప్రయాణమవుతున్న క్రమంలో నెహ్రూ పార్క్ సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను టాటా ఏస్ వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో సవితకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆమెను నగరంలోని జీజీహెచ్ కు చికిత్స కోసం తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. మృతురాలి భర్త నర్సాగౌడ్ ఘటనపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Similar News