గంజాయి కేసులో యువకుడి రిమాండ్

ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నిజామాబాద్ నగరంలో బుధవారం గంజాయి తరలిస్తున్న ఓ యువకుడిని అరెస్ట్ చేశారు.

Update: 2024-12-25 16:30 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్  డిసెంబర్ 25: ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నిజామాబాద్ నగరంలో బుధవారం గంజాయి తరలిస్తున్న ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. నగరంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఎం డి సాబెర్, గౌతంనగర్ కు చెందిన అఫ్సర్ అనే యువకుడితో కలిసి గంజాయి విక్రయిస్తుండగా.. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ స్వప్న ఆధ్వర్యంలో సిబ్బంది వారిని మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 550 గ్రాముల గంజాయి, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయించిన కేసులో నిందితుడు సాబెర్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.


Similar News