పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య
ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన మంద దేవేంద్ర (20) అనే యువకుడు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన మంద దేవేంద్ర (20) అనే యువకుడు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్మూర్ పట్టణ ఎస్ హెచ్ ఓ సత్య నారాయణ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం పిప్రి చెందిన యువకుడు మంద దేవేంద్ర ఇంట్లో పురుగుల మందు సేవించాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అందిస్తుండగా పురుగుల మందు సేవించిన యువకుడు దేవేంద్ర గురువారం మృతి చెందాడు. యువకుడి మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు పక్కగా తెలియలేవని ఎస్హెచ్ఓ పేర్కొన్నారు.