స్పెషల్ టీం విధులకు ఆటంకం

ఉమ్మడి మండలంలో రోజురోజుకు ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి.

Update: 2024-12-26 10:47 GMT

దిశ, కోటగిరి : ఉమ్మడి మండలంలో రోజురోజుకు ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడం కోసం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో కొద్దీ రోజుల క్రితం ఒక స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసి రాత్రి సమయాలలో గస్తీ కాస్తున్నారు. కానీ ఇసుక మాఫియా మాత్రం అధికారుల కళ్ళుగప్పి రాత్రి పగలు అనే తేడా లేకుండా నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. బుధువారం రాత్రి పోతంగల్ చెకపోస్ట్ వద్ద ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్ ను స్పెషన్ టీం పట్టుకొన్ని పోలీస్ స్టేషన్ తరలిస్తుండగా..కొందరు ఇసుక మాఫియాదారులు స్పెషల్ టీమ్ సిబ్బందిని దౌర్జన్యంగా పక్కకు తోసేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అదే ప్రదేశంలో ఉన్న జేసిబిని సిబ్బంది పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమ విధులకు ఆటంకం కలిగించి దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Similar News