ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు తీసేయండి.. ట్విట్టర్‌లో ప్రభుత్వానికి డిమాండ్

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు గత మూడేళ్లుగా నోటిఫికేషన్ల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. Latest Telugu News..

Update: 2022-03-19 11:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు గత మూడేళ్లుగా నోటిఫికేషన్ల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో త్వరలో 50వేల ఉద్యోగాలు అంటూ ఏడాదిన్నరగా ప్రభుత్వం చెబుతూ వస్తుండటంతో నిరాశ చెందిన కొందరు నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. సీఎం ప్రకటనతో రాష్ట్రంలోని యువత తిరిగి నగరానికి చేరుకొని లైబ్రరీలు, కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. ఈసారి విడుదల చేసే నోటిఫికేషన్లలో వయోపరిమితి పెంచుతుండటంతో భారీగా అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది.

దీంతో ఒక్క పోస్టుకు దాదాపు వెయ్యి మంది వరకు పోటీ పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూ ప్రక్రియను ఎత్తివేయాలని తెలంగాణలోని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గత నోటిఫికేషన్లలో వచ్చిన ఆరోపణలను లేవనెత్తుతూ.. నిరుద్యోగులు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంటర్వ్యూల కారణంగా నియామకాల భర్తీ కూడా ఆలస్యమవుతుందని సూచిస్తున్నారు. అయితే ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకే ఎత్తివేసింది.

Tags:    

Similar News