దుబాయ్ లో గొల్లపల్లి వాసి అదృశ్యం...

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన అందె శ్రీకాంత్ అనే యువకుడు దుబాయ్ వెళ్లి అదృశ్యమయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

Update: 2024-12-22 02:05 GMT

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన అందె శ్రీకాంత్ అనే యువకుడు దుబాయ్ వెళ్లి అదృశ్యమయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అందె శ్రీకాంత్ అనే యువకుడు ఈ నెల 15 న దుబాయ్ దేశానికి కంపెనీ వీసా పై వెళ్ళాడు. శ్రీకాంత్ తండ్రి బాబు గత ఎనిమిది సంవత్సరాల క్రితం చనిపోగా తల్లి లక్ష్మి కూలీ పని చేసుకుంటూ తన ముగ్గురు కొడుకులను , ఒక కూతురును పెంచి పోషించింది. కాగా శ్రీకాంత్ దుబాయ్ దేశానికి షుగర్ కంపెనీకి సంబంధించి వర్క్ వీసా మీద ఈ నెల 15 న ముంబై ఎయిర్ పోర్ట్ నుండి దుబాయ్ కి వెళ్ళాడు.

దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో దిగిన శ్రీకాంత్ అక్కడి ఏజెంట్ కు సమాచారం ఇవ్వగా కంపెనీ వారు జెబ్లలి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లినారు. కంపెనీలోకి వెళ్లిన శ్రీకాంత్ మతిస్థిమితం సరిగా లేక అయిదు రోజుల పాటు దుబాయ్ లో అనుమానస్పదంగా తిరుగుతుండగా అక్కడి పోలీసులు పట్టుకున్నారు. కంపెనీ నుండి జెబ్లలి ప్రాంతానికి వెళ్లగా అక్కడి పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారని దుబాయ్ నుండి పలువురు దిశకు తెలిపారు. తన కొడుకును క్షేమంగా ఇంటికి చేర్చండి. శ్రీకాంత్ తల్లి లక్ష్మి తన కొడుకు బతుకుదెరువు కోసం దుబాయ్ దేశం వెళ్లి అక్కడి పోలీసులు అదుపులో ఉన్నాడని, తనని క్షేమంగా ఇంటికి చేర్చాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను, భారత రాయభార కార్యాలయం అధికారులను కోరారు.


Similar News