Ananya Pandey: ఆ బాధ తట్టుకోలేక చికిత్స తీసుకున్నా.. అనన్య పాండే షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

Update: 2024-11-25 11:05 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అలాగే సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూ(Interview)లో పాల్గొన్న అనన్య షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను గతంలో చికిత్స తీసుకున్నాను. కానీ ఇప్పుడు రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు తీసుకుంటున్నా.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంతో నెగెటివిటీ(Negativity) ఎదుర్కొన్నాను. ఎన్నో విమర్శలు చేశారు. వాటి వల్ల చాలా బాధపడ్డాను. భావోద్వేగాలను తట్టుకోలేక పోయేదాన్ని. ఆత్మవిశ్వాసం కోల్పోయి మానసిక ఒత్తిడికి లోనయ్యా. కారణం ఏంటంటే.. కొందరు చేసే విమర్శలు. కొన్ని సందర్భాల్లో మనం సోషల్ మీడియా(Social Media)లో వచ్చిన కామెంట్స్ చదువుతుంటాం.

ఆ సమయంలో అవి మనల్ని పెద్దగా ప్రభావితం చేయవు కానీ కొంతకాలం తర్వాత పదే పదే అవి మనకు గుర్తుకు వస్తుంటాయి. ఇబ్బంది పెడుతుంటాయి. నా విషయంలో అలాగే జరిగింది. అందుకే థెరపీ తీసుకున్నా. దీనివల్ల నా ఆలోచనా విధానం మెరుగుపడింది’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ అనన్య పాండే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Read more...

Ranbir Kapoor: ‘యానిమల్’ సినిమాపై విమర్శలు.. రణ్‌బీర్ కపూర్ ఏమన్నారంటే?




Tags:    

Similar News