V. Hanumantha Rao : బీసీల సంక్షేమం కాంగ్రెస్ కే సాధ్యం : వీహెచ్

బలహీన వర్గాల సంక్షేమానికి..అభివృద్ధి(Welfare of BC)కి పనిచేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వాని(Congress Government)కే ఉందని..కామారెడ్డి డిక్లరేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు(V. Hanumantha Rao)స్పష్టం చేశారు.

Update: 2025-01-04 08:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : బలహీన వర్గాల సంక్షేమానికి..అభివృద్ధి(Welfare of BC)కి పనిచేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వాని(Congress Government)కే ఉందని..కామారెడ్డి డిక్లరేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు(V. Hanumantha Rao)స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ 42శాతం పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీజేపీనీ విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు ఉండవచ్చేమో గాని కాంగ్రెస్ ను విమర్శించే హక్కు మాత్రం బీఆర్ఎస్ కు లేదన్నారు. బీసీలకు అనేక అవకాశాలు కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. బీసీలను పీసీసీ అధ్యక్షులు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. కేసీఆర్ ధర్నా చౌక్ లేకుండా చేయాలని చూశారని, మేము కొట్లాడి తెచ్చుకున్న ధర్నా చౌక్ ఇప్పుడు బీఆర్ఎస్ కు దిక్కు అయ్యిందని ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మారినప్పుడే ప్రజలు ఆ పార్టీకి దూరం అయ్యారని విమర్శించారు. బీసీల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితమ్మ కపట ప్రేమ ఒలకబోస్తుందని..తన తండ్రీ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎందుకు బయట పెట్టలేదని, స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ ఎందుకు తగ్గించాడని వీహెచ్ నిలదీశారు. పదేళ్లలో బీసీలకు ఏం చేశారో ఒక్కటి చెప్పండని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఐఐటీ, ఐఐఎం లలో రిజర్వేషన్ తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఐదు ఏళ్లలో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తామని, మీ తగాదాలు ఉంటే.. మీరు చూసుకోండని కవిత, కేటీఆర్, హరీష్ రావులకు చురకలేశారు. మా ప్రభుత్వం ప్రగతి భవన్ పేరును మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మార్చామని..ఏడాదిలో జరిగిన ఈ అభివృద్ధిని చూసి వారు  ఓర్వలేకపోతున్నారన్నారు.

మంచి సలహాలు ఇస్తే తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడన్నారు. మాజీ సీఎం కేసిఆర్ ఎక్కడ ఉన్నాడో తెల్వదని, కౌంటర్లు కాదు.. అభివృద్ధి మా కల్చర్ అని, తెలంగాణ తెచ్చిన..ఇచ్చిన పార్టీ మాదేనని వీహెచ్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారని, దేశ వ్యాప్తంగా కుల గణన అమలు చేయాలని కోరుతున్నారని వీహెచ్ వెల్లడించారు.

Tags:    

Similar News