Brahmamudi : నంద గోపాల్ మీద ఫైర్ అయిన అనామిక
ఫోన్ చేసి నీ లొకేషన్ రాజ్ కూడా తెలిసేలా చేస్తావా
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
రాజ్ నందగోపాల్ ను పట్టుకోలేకపోతాడు. గదిలోకి వెళ్లి చాలా బాధ పడుతూ ఉంటాడు. కావ్య బాగా ధైర్యం చెబుతుంది. ఇంకో వైపు అనామిక దగ్గరకు నందగోపాల్ వెళ్ళగానే చెంప చెళ్ళుమనిపిస్తుంది. పక్కనే సామంత్ కూడా ఉంటాడు. కూల్ కూల్ అని అనామికా కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ‘అసలు నిన్ను నమ్మకుని మేము అక్కడ ఉంటే .. నువ్వు మా గురించి ఆలోచించవా.. అయిన నీకు ఇప్పుడు అమ్మాయి కావాల్సిందా? ఏకంగా గెస్ట్ హౌస్ కే అమ్మాయిని తెచ్చుకుందామనుకున్నావా ..? అదే కాకుండా ఫోన్ చేసి నీ లొకేషన్ రాజ్ కూడా తెలిసేలా చేస్తావా’? అంటూ అనామిక ఫైర్ అవుతుంది. మేడమ్ నేను కావాలని చేయలేదు .. సారీ సారీ అంటూ నందగోపాల్ చెబుతాడు.
హేయ్ ఆపు .. నీ సారీ ఎవరికీ కావాలి ? ఇంకోసారి ఏం అయిన తేడా వస్తే మేమే పోలీసులకు కాల్ చేసి నీ సమాచారం మొత్తాన్ని ఇస్తాం’ అని అనామిక అంటుంది. ‘వద్దు మేడమ్ ప్లీజ్ వద్దు.. ఆ పని మాత్రం చేయకండి’ అంటాడు నందగోపాల్. మరి ‘అలాంటప్పుడు మేము చెప్పింది చెప్పినట్టు చేయ్ ’ అని సామంత్ అంటాడు. ‘ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను' అని నందగోపాల్ అంటాడు. ఇదే రిపీట్ అయితే ఇంకోసారి ఈసారి నవ్వు ప్రాణాలతో ఉండవని చెబుతుంది.
Read More...
Karthika Deepam : పెద్దలను గౌరవించడం నేర్చుకో అంటూ జ్యోకి వార్నింగ్ ఇచ్చిన సుమిత్ర