బ్లూ చీరలో ఆకట్టుకుంటున్న యంగ్ హీరోయిన్.. ట్రెడిషనల్ క్వీన్ అంటూ కామెంట్స్(పోస్ట్)

యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇచట వాహనాలు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘ఖిలాడీ’, ‘హిట్: రెండవ కేసు’, ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’, ‘మట్కా’, ‘మెకానిక్ రాకీ’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

Update: 2025-01-06 09:04 GMT

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇచట వాహనాలు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘ఖిలాడీ’, ‘హిట్: రెండవ కేసు’, ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’, ‘మట్కా’, ‘మెకానిక్ రాకీ’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కూడా నటించింది.

అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మీనాక్షి చౌదరి ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో బ్లూ కలర్ శారీ కట్టుకుని ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు.. ‘ట్రెడిషనల్ క్వీన్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ భామ పోస్ట్‌పై ఓ లుక్ వేసేయండి.

Tags:    

Similar News