Brahmaji: వాళ్ళ ఓవర్ యాక్షన్ ముందు మా యాక్షన్ సరిపోవటం లేదు.. బ్రహ్మాజీ ట్వీట్ ఎవరిని ఉద్దేశించంటే?

టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ(Brahmaji) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు.

Update: 2025-01-06 10:29 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ(Brahmaji) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు. అంతేకాకుండా గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులతో నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాడు. తాజాగా, బ్రహ్మాజీ బౌన్సర్ల(Bouncers) మీద వరుస ట్వీట్లు చేసి వార్తల్లో నిలిచాడు.

‘‘ఎక్కడ చూసినా బౌన్సర్లు.. బౌన్సర్లు.. వాళ్ల ఓవర్ యాక్షన్ ముందు మా యాక్షన్ సరిపోవడం లేదు. ఏం చేయాలి. అవుట్ డోర్స్ అయితే ఫర్వాలేదు. సెట్స్‌లో కూడానా?’’ అని రాసుకొచ్చాడు. అయితే ఇటీవల బౌన్సర్ల ప్రవర్తన వల్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బ్రహ్మాజీ ట్వీట్స్ చేయడంతో అవి కాస్త చర్చనీయాంశంగా మారాయి. అయితే సెట్స్‌లో బౌన్సర్లు ఇబ్బంది పెట్టడం వల్లే ఇలా చేశాడని నెటిజన్లు అంటున్నారు.

Tags:    

Similar News