రాగట్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి బదిలీ...
ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాధిక బదిలీ అయ్యారు. ఆమెను కోనరావుపేట మండలానికి బదిలీ చేశారు.
దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాధిక బదిలీ అయ్యారు. ఆమెను కోనరావుపేట మండలానికి బదిలీ చేశారు. ఆమె స్థానంలో హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన రమేష్ అనే పంచాయతీ కార్యదర్శికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్తయ్య ఆదేశాలు జారీ చేశారు. రాధిక గ్రామంలో సమర్థవంతంగా విధులు నిర్వహించిందని ఆమె గ్రామానికి చేసిన సేవలు మరిచిపోలేనివని గ్రామస్తులు పేర్కొన్నారు.
రెండు గ్రామాలకు ఒక అధికారిని ఇంచార్జి గా నియమించడం వల్ల గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అసలే గ్రామాలల్లో సర్పంచ్ ల పాలన లేక పర్యవేక్షణ కొరవడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి కోనరావుపేట మండలానికి చేసిన రాధిక బదిలీ రద్దు చేసి మా గ్రామ కార్యదర్శిని మా గ్రామానికి కేటాయించాలని, లేని పక్షంలో ఎంపీడీఓ కార్యాలయం ముట్టడిస్తామని రాగట్లపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు.