Minister Atchannaidu:తెలుగు భాషాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళ్తోందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Achennaidu) పేర్కొన్నారు.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళ్తోందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Achennaidu) పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలుగులోనే ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ(AP Government) నిర్ణయంపై మంత్రి అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నేడు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు భాషాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో గత ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. అమ్మలాంటి మాతృభాషను గత ప్రభుత్వం అవమానపరిచిందని మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. మాతృభాషకు(mother tongue) సీఎం చంద్రబాబు(CM Chandrababu) హయాంలో సముచిత గౌరవం లభించిందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనూ ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగు భాష పట్ల ఉన్న గౌరవాన్ని చాటుతోందని తెలిపారు. సామాన్య ప్రజలు, పల్లెల్లో ప్రజానీకం అన్ని విషయాలు తెలుసుకునే విధంగా పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇచ్చిన సీఎం చంద్రబాబుకు మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారుల జీవనోపాది పెంచేందుకు కృషి చేస్తున్నాం.. త్వరలో వేట నిషేధంలో ఉన్న మత్స్యకారులకు రూ.20 వేలు ఇస్తామని శుక్రవారం మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.