Ap News: ఇద్దరు కానిస్టేబుల్ అభ్యర్థులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఇద్దరు కానిస్టేబుల్ అభ్యర్థులకు అస్వస్థతకు గురయ్యారు..
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అపశ్రుతి చోటు చేసుకుంది. హైట్, వెయిట్ చెక్ చేస్తుండగా ఇద్దరు మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వాళ్లను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.