అధిక మొత్తంలో వడ్డీలు.. కోరుట్లలో ఇద్దరు అరెస్ట్

ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అధిక మొత్తంలో వడ్డీలకు అప్పులిస్తూ సామాన్య ప్రజలను మోసం చేస్తున్న కోరుట్ల పట్టణానికి చెందిన

Update: 2022-07-30 09:34 GMT

దిశ, కోరుట్ల: ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అధిక మొత్తంలో వడ్డీలకు అప్పులిస్తూ సామాన్య ప్రజలను మోసం చేస్తున్న కోరుట్ల పట్టణానికి చెందిన ఎనుగందుల గంగాధర్, సదుల ప్రకాష్ అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రవీంద్ర రెడ్డి తెలిపారు. శనివారం కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలను వెల్లడించారు. ఎనుగందుల గంగాధర్, సదుల ప్రకాష్‌లు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా డబ్బులు అవసరమున్న వారికి భూమి పత్రాలు, పట్టాదారు పాసు పుస్తకాలు, ప్రామిసరి నోట్‌లు రాయించుకొని అధిక మొత్తంలో వడ్డీలకు ఇస్తున్నారని తెలిపారు. అధిక వడ్డీలు వసూల్ చేస్తున్నారన్న సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో వారి ఇండ్లపై దాడులు చేసి, వారి వద్ద నుండి నగదు, అప్పు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎనుగందుల గంగాధర్ వద్ద నుండి రూ.22 లక్షలు, సదుల ప్రకాష్ నుండి రూ. 1 లక్ష 85 వేలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అనుమతులు లేకుండా అధిక వడ్డీలకు అప్పులు ఇస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాని డీఎస్పీ రవీంద్ర రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐ రాజశేఖర్ రాజు, కోరుట్ల, కథలాపూర్ ఎస్ఐలు సతీష్, శ్యాంరాజ్, రాంచంద్రం పాల్గొన్నారు.


Similar News

టైగర్స్ @ 42..