Eldhose paul: ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత అథ్లెట్‌..

Triple Jumper Eldhose paul Sails into World Athletics Championships Final| అమెరికాలోని యూజీన్ వేదికగా జరుగుతోన్న అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో భారత ట్రిపుల్ జంపర్ ఎల్డోస్ పాల్ పైనల్‌కు దూసుకెళ్లాడు

Update: 2022-07-22 11:16 GMT

న్యూఢిల్లీ: Triple Jumper Eldhose paul Sails into World Athletics Championships Final| అమెరికాలోని యూజీన్ వేదికగా జరుగుతోన్న అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో భారత ట్రిపుల్ జంపర్ ఎల్డోస్ పాల్ పైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో 16.68 మీటర్ల దూరంలో దూకాడు. దీంతో ట్రిపుల్ జంప్ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారత అథ్లెట్‌గా ఎల్డోస్ చరిత్ర సృష్టించాడు. అయితే ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న భారత అథ్లెట్లు అబ్దుల్లా అబుబాకర్, ప్రవీణ్ చిత్రవేల్ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. కాగా, ఆదివారం జరిగే అధ్లెటిక్స్ చాంపియన్ షిప్ ఫైనల్స్‌లో ఎల్డోస్ పాల్ పోటీ చేయనున్నారు.

ఇది కూడా చదవండి: ఫైనల్ చేరిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రా..

Tags:    

Similar News