SBI ఖాతాను ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కి ఛేంజ్ చేయాలా..? బ్యాంకుకెళ్లాల్సిన అక్కర్లేదు

ఒకవేళ మీరు వేరే ప్రాంతాలకెళ్లి స్థిరపడ్డట్లైతే.. బ్యాంక్ అకౌంట్‌తో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది.

Update: 2024-11-18 15:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒకవేళ మీరు వేరే ప్రాంతాలకెళ్లి స్థిరపడ్డట్లైతే.. బ్యాంక్ అకౌంట్‌(Bank account)తో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. బ్యాంక్ ఖాతాను ఎలా మార్చుకోవాలి అని సతమతమవుతుంటారు. ఇందుకోసం మీరు బ్యాంకుల చుట్లు తిరగాల్సిన పనిలేదు. ఒకవేళ మీది ఎస్బీఐకు సంబంధించిన ఖాతా అయితే.. బ్రాంచ్‌కు వెళ్లకుండా మీ ఇంటి నుంచే మీకు ఇష్టమైన శాఖకు మీ అకౌంట్‌కు ఛేంజ్ చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం..

SBI సేవింగ్స్ ఖాతాను బ్రాంచ్‌ను ఛేంజ్ చేయాలనుకునే అభ్యర్థనను నెట్ బ్యాంకింగ్(Net banking) ద్వారా నమోదు చేయాలి. ఇందుకు బ్రాంచ్ కోడ్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్‌ను నమోదు చేయాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్(Internet banking) ఉండాలి. బ్రాంచ్ మార్చే విధానం చూసినట్లైతే.. ముందుగా ఎస్బీఐ అఫిషీయల్ వెబ్‌సైట్ onlinesbi.comకి లాగిన్ అయి.. తర్వాత పర్సనల్ బ్యాంకింగ్ మీద నొక్కాలి. క్లిక్ చేశాక వినియోగదారునిపేరు, పాస్‌వర్డ్ పై క్లిక్ చేయాలి.

ఇప్పుడు ఈ-సేవ ట్యాబ్(E-Service tab) వస్తుంది. దీన్ని నొక్కాక.. ట్రాన్స్‌ఫర్ సేవింగ్స్(Transfer Savings) ఖాతాపై నొక్కి.. ట్రాన్స్‌ఫర్ చేసే ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి. ఇప్పుడు అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ కోడ్(IFSC Code) డిటైయిల్స్ టైప్ చేయాలి. చివరగా ఓకే నొక్కాక మీ మొబైల్‌కు ఓటీపీ(OTP) వస్తుంది. ఓటీపీ నెంబర్ ఎంటర్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత మీకు ఎంపిక చేసుకున్న బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

Tags:    

Similar News