చదువుతోనే అన్ని సాధించగలం: ట్రెయినీ ఆఫీసర్లు
దిశ, రామడుగు: అందరూ ఉన్నత విద్య చదివితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని..Trainee officers visits school
దిశ, రామడుగు: అందరూ ఉన్నత విద్య చదివితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ట్రెయినీ ఆఫీసర్లు అన్నారు. ట్రెయినీ ఆఫసీర్స్ క్షితిజ్ సక్సేనా, విక్రాంత్ సింగ్, హిమాన్షు వర్మ, డి. నాగేంద్ర బాలాజీ వెలిచాల విలేజ్ విజిట్ లో భాగంగా సరస్వతి ఇంగ్లీష్ హైస్కూల్ ను గురువారం సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతంగా చదివి దేశాభివృద్ధికి తోడ్పడాలన్నారు. చిన్నతనం నుంచే క్రమశిక్షణతో చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారని, ఏ రంగంలోనైనా రాణించగలుగుతారని అన్నారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ ఉప్పుల శ్రీనివాస్, కో-కరస్పాండెంట్ ఉప్పుల సత్యం, సర్పంచ్ వీర్ల సరోజన, ఎంపీడీవో ఎన్. ఆర్. మల్హోత్ర, ఎంపీవో సతీశ్రావు తదితరులు పాల్గొన్నారు.