వేసవిలో వేడి.. తగ్గించుకోండి ఇలా! సమ్మర్ సీజన్ బెస్ట్ ఆప్షన్స్

దిశ, ఫీచర్స్ : భారత్‌లోని అనేక ప్రాంతాల్లో మార్చి ప్రారంభంలోనే సమ్మర్ సీజన్ మొదలైంది. దీంతో భగభగలాడే.. Latest Telugu News..

Update: 2022-03-12 02:03 GMT

దిశ, ఫీచర్స్ : భారత్‌లోని అనేక ప్రాంతాల్లో మార్చి ప్రారంభంలోనే సమ్మర్ సీజన్ మొదలైంది. దీంతో భగభగలాడే భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం పొందేందుకు జనాలు లిక్విడ్ డ్రింక్స్‌ వైపు పరుగెడుతున్నారు. ఇక ఎండ తాకిడి వల్ల డీహైడ్రేషన్‌కు గురైన బాడీని రీచార్జ్ చేయాలంటే నిమ్మరసానికి మించిన పరిష్కారం లేదు. లెమన్, పెరుగు, ఇతరత్రా సీజనల్ బెర్రీస్, ఫ్రూట్స్‌తో తయారుచేసే ఫేవరెట్ డ్రింక్ 'షెర్బత్' గురించి తెలిసిందే. ప్రపంచంలోని మొట్టమొదటి శీతల పానీయంగా చెప్పబడే షర్బత్‌(పాలు, పండ్లు, చక్కెర మిశ్రమం)కు పెర్షియన్ మూలాలు ఉన్నప్పటికీ.. భారతదేశంలో దీని ప్రభావం మొఘల్ పాలనలో కార్యరూపం దాల్చింది. అయితే మూలాలు ఏవైనా శతాబ్దాలుగా దాహార్తిని తీర్చడంలో అనేక రకాల షర్బత్ ఫ్లేవర్స్ ముందుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇండియాలో ప్రసిద్ధి చెందిన కొన్ని పానీయాల వివరాలు..


బాబ్రీ బియోల్

ఉత్తర భారతదేశంలో రుచికరమైన పానీయంగా గుర్తింపు పొందిన బాబ్రీ బియోల్.. జమ్మూ, కశ్మీర్‌లో బాగా ప్రసిద్ధి. తులసి గింజలు లేదా సబ్జా గింజలతో తయారు చేయబడిన పురాతన వేసవి పానీయాన్ని మొఘల్ చక్రవర్తి బాబర్ ఈ ప్రాంత ప్రజలకు పరిచయం చేశాడని ప్రచారంలో ఉంది. పాలు, నీరు, తులసి గింజలతో పాటు కొబ్బరి వంటి పదార్థాలతో తయారు చేసిన బాబ్రీ బియోల్‌ను స్థానిక భాషలో 'కాన్ షర్బత్' అని కూడా పిలుస్తారు. కాన్ అంటే విలువైన ఆభరణాలు కాగా.. నీటిలో నానబెట్టినప్పుడు అపారదర్శక ముత్యాలుగా ఉబ్బినటువంటి సబ్జా గింజలను ఈ విధంగా పిలుస్తారు.


సోల్ కడి

ఉక్కపోత వాతావరణం లేదా రూమ్ టెంపరేచర్‌లో ఈ పానీయం అద్భుతమైన కూలింగ్ ఇన్‌గ్రెడియంట్‌గా పనిచేస్తుంది. కొంకణ్ తీరప్రాంతంలో పుట్టిన ఈ పానీయాన్ని కొబ్బరి పాలు, కోకుమ్ సిరప్‌తో పాటు మిరప, జీలకర్ర, ఆవాలు వంటి సుగంధ ద్రవ్యాల మిశ్రమంగా తయారు చేస్తారు. మహారాష్ట్రలో సాధారణ స్వీట్ అండ్ స్పైసీ డ్రింక్‌గా ప్రసిద్ధి చెందిన 'సోల్ కడి' ఇంకా దేశవ్యాప్తంగా పాపులర్ అవలేదు. ఇది వేసవిలో మసాలాతో కూడిన భోజనం తర్వాత శరీరానికి ఉపశమనాన్ని ఇవ్వడమే కాక ఆరోగ్యానికి, ఆత్మకు కూడా మేలు అని స్థానికులు చెబుతున్నారు.


గోంధొరాజ్ ఘోల్

సాధారణంగా మజ్జిగ రుచి అందరికీ తెలుసు కానీ పశ్చిమ బెంగాల్‌‌కు మాత్రం బటర్ మిల్క్‌లో సెపరేట్ వెర్షన్ ఉంది. కింగ్ ఆఫ్ లెమన్స్‌గా పిలువబడే 'గొంధొరాజ్' రకం నిమ్మకాయ రసంతో పెరుగు, నల్ల ఉప్పు, పంచదార, ఐస్ వాటర్‌‌ మిశ్రమంగా 'గోంధొరాజ్ ఘోల్' పానీయాన్ని తయారుచేస్తారు. సమ్మర్ సీజన్‌లో ఈ డ్రింక్ బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నప్పటికీ.. అనేక మిశ్రమాలతో కూడిన ఈ సాధారణ పానీయంలో వాడే పదార్థాల లభ్యత ఆధారంగా ఏడాది పొడవునా వినియోగిస్తారు.


చువాక్

ఈశాన్య భారతంలోని త్రిపుర ప్రాంతంలో స్థానికంగా తయారుచేసే పానీయం 'చువాక్'. స్ట్రాంగ్ ఫ్లేవర్స్‌ సమ్మేళనంతో విభిన్న రుచిని కలిగి ఉంటుంది. రైస్, బీరును పులియబెట్టడం ద్వారా తయారు చేయబబడే ఈ రైస్-బీర్‌ను పండగలు, వివాహాలు వంటి స్పెషల్ కమ్యూనిటీ గ్యాదరింగ్స్‌లో సేవిస్తారు. సాధారణంగా కమ్యూనిటీలోని అత్యంత అనుభవజ్ఞులైన వ్యక్తులు తయారుచేసే ఈ పానీయాన్ని ప్రేమ, ప్రశంసలకు చిహ్నంగా కుటుంబంతో షేర్ చేసుకుంటారు.


టిక్కూర్ షర్బత్

ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన ప్రత్యేకమైన పానీయం 'టిక్కూర్'కు మరో పేరు 'పాలో'. ఇది కర్కుమా అంగుస్టిఫోలియా అని పిలువబడే దేశీయ మూలిక నుంచి ప్రాసెస్ చేయబడిన రైజోమ్(వేరు దుంప). ఈస్ట్ ఇండియన్ 'ఆరోరూట్'గానూ ప్రసిద్ధి. ఈ పానీయం తయారీకి రోజుల తరబడి శ్రమించాల్సి ఉంటుంది. స్థానికంగా సేకరించిన రైజోమ్‌ను రాత్రిపూట నానబెట్టి శుభ్రం చేసిన తర్వాత ఓ పేస్ట్‌ మాదిరి తయారు చేస్తారు. అవశేషాలను వడగట్టి ఆపై ఎండలో గుళికల(గ్లోబ్యుల్స్) రూపంలో ఆరబెడతారు. ఇక కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉండే ఈ గ్లోబుల్స్‌తో తయారు చేయబడిన ఈ షుగర్ కోటెడ్ డ్రింక్.. ఎముకల ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు శరీరాన్ని చల్లగా ఉంచడంలో సాయపడుతుంది.


నోంగు షర్బత్

తాటి చెట్టు ముంజల నుంచి ఈ పానీయాన్ని తయారు చేస్తారు. దేశవ్యాప్తంగా పాపులరైన ఈ డ్రింక్‌ను మహారాష్ట్రలో టార్గోలా, పశ్చిమ బెంగాల్‌లో తాల్, తమిళనాడులో నోంగు వంటి పేర్లతో పిలుస్తారు. అనేక సూక్ష్మ రుచులతో నిండిన ఈ బాడీ కూలర్.. అనేక ప్రయోజనాలను అందిస్తుంది. సాంప్రదాయకంగా చక్కెర, నీరు, నిమ్మరసం వంటి సాధారణ పదార్థాలతో తయారు చేసినప్పటికీ చాలామంది దీనిని మామిడి, గులాబీ, పాలతో కలిపి కూడా తయారుచేస్తారు.

Tags:    

Similar News