Samantha: సమంత సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో.. కాంబో అదుర్స్ అంటున్న నెటిజన్లు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)తెలుగు హీరోలందరి సరసన నటించి కొద్ది కాలం ఇండస్ట్రీలో రాణించింది.

Update: 2024-10-16 07:26 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)తెలుగు హీరోలందరి సరసన నటించి కొద్ది కాలం ఇండస్ట్రీలో రాణించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. కానీ గత ఏడాది ఆమెకు మయోసైటీస్ వ్యాధి రావడంతో సినిమాలకు దూరం అయింది. చివరిగా సమంత, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)సరసన ‘ఖుషి’ మూవీలో నటించి మెప్పించింది. ఆ తర్వాత పూర్తిగా ఇంట్లోనే ఉంటూ మయోసైటీస్ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది.

అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటోంది. అయితే ఇటీవల ఫ్యాన్స్ మళ్లీ సినిమాల్లో నటించాలని కోరడంతో ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ (Tralala Moving Pictures)సంస్థ ప్రారంభించింది. తన సొంతం బ్యానర్‌పై ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram)మూవీ తెరకెక్కనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఇందులో సమంత(Samantha)నే లీడ్ రోల్ చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించింది. కానీ ఆ తర్వాత నుంచి సామ్ సైలెంట్ అయిపోయింది. దీంతో అభిమానులు మాత్రం మా ఇంటి బంగారం అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాబోతున్న రెండో సినిమాలో సమంత ‘బలగం’ మూవీ హీరో ప్రియదర్శితో రొమాన్స్ చేయనుందని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల కానుందని తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన నెటిజన్లు కాంబో అదుర్స్ అని కామెంట్లు చేస్తున్నారు. 

Tags:    

Similar News