ఈ రోజు ప్రత్యేకత: నేషనల్ మ్యాంగో డే
దిశ, ఫీచర్స్: మామిడి కాయలు క్రీస్తు పూర్వం ఐదు వేల ఏళ్ల కిందట జంబూ ద్వీపంలో మొదటిసారి కాసినట్లు చరిత్ర చెబుతోంది..Latest Telugu News
దిశ, ఫీచర్స్: మామిడి కాయలు క్రీస్తు పూర్వం ఐదు వేల ఏళ్ల కిందట జంబూ ద్వీపంలో మొదటిసారి కాసినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే క్రీస్తు శకం ఐదు వందల ఏళ్ల తర్వాత ఇండియాకు చేరుకున్న ఈ ఫ్రూట్.. అనతికాలంలోనే దేశమంతటా విస్తరించి, ఇండియాలో అత్యధికంగా కాసే పండ్లలో ప్రత్యేకస్థానం సంపాదించాయి. అంతేకాదు ప్రపంచం మొత్తం కాసే మామిడిలో సగానికిపైగా ఇండియాలోనే కాస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అందుకే మామిడి మన జాతీయ ఫలంగా గుర్తింపు పొందగా.. మొదటిసారిగా 1987లో జూలై 22న ఢిల్లీలో 'నేషనల్ మ్యాంగో డే'ను జరుపుకున్నారు.
అప్పటి నుంచి ప్రతీ ఏటా జూలై 22న జాతీయ మామిడి పళ్ల దినోత్సవాన్ని ఆనవాయితీగా జరుపుకుంటూ.. ఇతరులపై స్నేహాన్ని తెలిపేందుకు బుట్టలో మామిడి పళ్లు పంచుతున్నాం. ఇక విటమిన్ C పుష్కలంగా ఉన్న ఈ ఫ్రూట్ ఇండియాలోనే కాకుండా పాకిస్థాన్, ఫిలిప్పీన్స్‌లో కూడా జాతీయ ఫలంగా కొనసాగుతోంది. ఇక తెలుగు లోగిళ్లలో మామిడి పచ్చళ్లు, ఊరగాయలు లేని ఇళ్లు ఉండవంటే అతిశయోక్తి కాదు.