Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (03-12-2024)

చిన్న చిన్న విషాలకే ఎక్కువగా ఎగ్జైట్ అవుతుంటారు.

Update: 2024-12-02 21:45 GMT

మేష రాశి: చిన్న చిన్న విషాలకే ఎక్కువగా ఎగ్జైట్ అవుతుంటారు.చిన్న చిన్న విషాలకే ఎక్కువగా ఎగ్జైట్ అవుతుంటారు. డబ్బు సంపాదించాలని బాగా ఉంటుంది. కానీ ఇంటి ప్రాబ్లమ్స్‌తో బాధపడుతుంటారు. నేడు ఎక్కువగా బయట గడుపుతారు. సమయం వృథా చేసుకోకుండా అవసరమైన పనులపై దృష్టి సారించడం మంచిది. ఇతరులతో గొడవ పడే చాన్స్ ఉంటుంది. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  

వృషభ రాశి:  ఈ రాశి వారు భయాన్ని పోగోట్టుకోవడం మంచిది. నేడు పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. డబ్బు సంపాదిస్తారు.కానీ ఇట్టే మాయమైపోతుంది. శుభవార్తలు వింటారు. ఈ రాశి వారు నేడు ఏ పని చేసిన విజయం సాధిస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు. మీ భాగస్వామితో అన్ని విషయాలు పంచుకుంటారు.

మిథున రాశి: మీ ఆలోచనలు మీ అదుపులో ఉంచుకోవడం బెటర్. ఇతరులతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోండి. నేడు డబ్బు పరంగా బాగానే ఉంటారు. కానీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ప్రశాంతంగా గడుపుతారు. అన్నాదమ్మలు, అక్కాచెల్లెల్లతో కలిసి సినిమాకు వెళ్తారు. భాగస్వామితో కలిసిమెలిసి ఉంటారు. 

కర్కాటక రాశి: ఆర్థిక పరంగా నష్టపోతారు. ఎక్కడ, ఎలా ఖర్చు అవుతున్నాయో తెలియదు. కాగా డబ్బు ఖర్చు పెట్టేవిషయంలో జాగ్రత్తగా మెలగండి. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. మీ పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. కుటుంబంలో శాంతి ఉంటుంది. మీ భాగస్వామి మీతో మునుపెన్నడు లేని విధంగా మీతో ప్రేమగా ఉంటారు.

సింహ రాశి: ఆర్థికపరంగా దూసుకుపోతారు. ఫ్రెండ్స్ నుంచి విలువైన బహుమతులు అందుకుంటారు. అనుకున్నవి సాధిస్తారు. ఎక్కువగా పాటలు వింటారు. మీ ఇంటికి చుట్టాలు వస్తారు. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. కానీ కొన్ని విషయాల్లో ఒత్తికి గురవుతారు. భాగస్వామితో పోట్లాడవచ్చు.

కన్యా రాశి: ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవడం బెటర్. కుటుంబ సభ్యులకు సహాయపడండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోండి ప్రేమలో నిరాశకు గురవుతారు. మీరు పని చేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు. ఫ్రెండ్స్‌ తో గడుపుతారు. 

తులా రాశి: మంచి ఫలితాలు పొందడం కోసం మీరు ఏకాగ్రతతో పని చేయండి. నేడు ఆర్థికపరంగా లాభాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు ఆనందంగా ఉంటారు. కష్టపడి పని చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. కాగా జాగ్రత్త వహించండి. ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తారు.

వృశ్చిక రాశి: మీ చిరకాల అప్పులను తీర్చేస్తారు. మిమ్మల్ని ఇష్టపడేవారితో గడపుతారు. ఒకరిపై ఒకరు ఎనలేని ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. చెడు ఆలోచనలు మానుకోవడం మంచిది. వైవాహిక జీవితం కంట్రోల్ తప్పుతుంది.

ధనుస్సు రాశి: నేడు చాలా ఎనర్జీగా పని చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. మీరు ఊహించలేని లాభాలు వస్తుంటాయి. ఫ్రెండ్స్‌తో గడుపుతారు. మిమ్మల్ని చికాకు తెప్పిస్తూన్న బాధ్యతల్ని నేడు మీ బంధువులు వారిమీద వేసుకుంటారు. తల్లిదండ్రులు ఒక మాట ఊరికే తిరిగి గొడవ పడకండి. భాగస్వామి మీ మధ్య చిన్న చిన్న గొడవలు రావచ్చు.

మకర రాశి: నేడు ఖర్చు చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. ఇవాళ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. కానీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలుప పెరుగుతాయి.మీ భాగస్వామికి బాగా సపోర్ట్‌గా నిలుస్తారు.

కుంభ రాశి: నేడు ఈ రాశివారు కొత్తగా ఆలోచిస్తారు. మానసిక ప్రశాంతతకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది. దీంతో మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసుకుంటారు. కుటుంబ బాధ్యతలు నెత్తిమీద వేసుకుంటారు. ఎక్కువగా చాక్లెట్స్ తింటారు. భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తపరుస్తారు.

మీన రాశి: అనారోగ్యం నుంచి కోలుకుంటారు. ఆర్థిక బాగుపడతాయి. ఇవాళ మంచి మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోషపెడతారు. ఎక్కువగా ఆటల్లో పాల్గొంటారు. కుటుంబం కోసం రిస్క్ చేస్తారు. మీ భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు.

Tags:    

Similar News