యువత సామాజిక సేవలో భాగస్వాములు కావాలి : వేలుముల స్వరూప తిరుపతిరెడ్డి

యువత సామాజిక సేవలో భాగస్వాములై సమాజ అభివృద్ధికి

Update: 2024-12-04 08:22 GMT

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : యువత సామాజిక సేవలో భాగస్వాములై సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేముల స్వరూప తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఉత్తమ సామాజిక సేవా అవార్డు వచ్చిన ప్రేరణ స్వచ్చంధ సంస్థ ప్రతినిధులను ఆమె సన్మానించారు. ఈ సందర్భంగా స్వరూప మాట్లాడుతూ ప్రతిష్టాత్మక సంస్థ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( బిక్కి) ప్రకటించిన అవార్డుల్లో సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రేరణ స్వచ్చంధ సంస్థ కు ఉత్తమ సామాజిక సేవా అవార్డు రావడం చాలా గర్వకారణమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో చాలా చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రేరణ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అన్నారాపు వేణుగోపాల్, వెల్దండి సాయి కృష్ణ, బూర సతీష్ ,నీలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News