తెలంగాణ కోసం తొలిసారి లేఖ ఇచ్చింది ఆయనే: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కోసం తొలిసారి లేఖ ఇచ్చింది ఆయనేనని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..
దిశ, వెబ్ డెస్క్: ప్రత్యేక తెలంగాణ(Telangana) కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandi)కి తొలిసారి లేఖ ఇచ్చింది చిన్నారెడ్డేనని సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) అన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ సభ(Peddapally Congress Sabha)లో సీఎం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి కారణమైన పరిస్థితులను వివరించారు. తెలంగాణ ఉద్యమం ఖమ్మంలో లేదని అప్పట్లో ప్రచారం చేశారని, కానీ కొత్త గూడెం నుంచే ప్రారంభమైందని ఆయన తెలిపారు. తమకు ఉద్యోగాలనే నినాదంతోనే ఉద్యమం మొదలైందన్నారు. సంవత్సరం క్రితం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజలు ఓట్లు వేస్తేనే తమకు పదవులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ప్రజల అభిమానంతోనే తాను ముఖ్యమంత్రిని అయ్యాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మార్పు కావాలని, కాంగ్రెస్ రావాలనే నినాదంతో ఎన్నికలకు వెళ్లామని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చామని తెలిపారు. ప్రజల త్యాగాలు, ఆకాంక్షలు తనకు తెలసని, అందుకు అనుగుణంగానే పాలన సాగిస్తున్నానని రేవంత్ చెప్పారు.
తెలంగాణలో ఉద్యోగావకాశాలు, గిట్టుబాటు ధర వస్తుందని ప్రజలు అశించారని, కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former Chief Minister KCR) పాలనలో అలా జరగలేదన్నారు. రైతులు(farmers) ఉరేసుకుని బలవన్మరణాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. కేసీఆర్‌కు మాత్రం ఎకరాకు కోటి పంట పడిందని ఎద్దేవా చేశారు. ఎకరాకు కోటి ఆదాయం ఇప్పటికీ బ్రహ్మపదార్థమేననని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.