Women's Reservation Bill: 'చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్!'
న్యూఢిల్లీ: తృణముల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ కీలక ప్రతిపాదన చేశారు..latest telugu news
న్యూఢిల్లీ: తృణముల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ కీలక ప్రతిపాదన చేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ 33 శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ బిల్లును ప్రవేశపెట్టాలని నోటీసులు సమర్పించారు. 56 ఇంచుల ప్రధాని మోడీ ప్రభుత్వానికి బహిరంగ సవాలు విసురుతున్నాను. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టండి. 168 నియమం ప్రకారం ఓటు తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించండి అని ఒబ్రెయిన్ ట్వీట్ చేశారు.
అంతేకాకుండా పార్టీల వారీగా మహిళా అభ్యర్థులు ప్రాతినిధ్యం వహిస్తున్న శాతాన్ని కూడా షేర్ చేశారు. దీనిలో టీఎంసీ నుంచి అత్యధికంగా 37శాతం పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, బీజేపీ 13 శాతం మాత్రమే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి 15 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లింగ వ్యత్యాస నివేదికలో 156 దేశాలకు గానూ భారత్ 140 స్థానంలో ఉన్నట్లు ఒబ్రెయిన్ తెలిపారు. మంత్రులలో మహిళల వాటా గణనీయంగా తగ్గడంతో, 2019లో 23 శాతం నుంచి 2021లో 9.1 శాతానికి పడిపోయింది. ఇక ప్రస్తుత లోక్‌సభలో 15శాతం మహిళా ఎంపీలు ఉండగా, రాజ్యసభలో 12.2శాతం ఉన్నారు. కాగా, రూల్ 168 కింద ప్రజలకు ఉపయోగపడే విషయాలను ఎంపీలు లేవనెత్తవచ్చు.