Chandini Chowdary: నాకు తీవ్రమైన గాయం అయింది.. యంగ్ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్.. ఆందోళనలో ఫ్యాన్స్
తెలుగమ్మాయి చాందిని చౌదరి(Chandini Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: తెలుగమ్మాయి చాందిని చౌదరి(Chandini Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కలర్ ఫొటో’(Colour Photo) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. సుహాస్(Suhas) హీరోగా నటించిన ఈ మూవీ ఎంతగా హిట్ అయిందో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి ఫేమ్ సంపాదించుకున్నది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘సంతాన ప్రాప్తిరస్తు’(Santhana Prapthirasthu) అనే ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. ఈ సినిమాలో కళ్యాణి ఒరుగంటి(Kalyani Oruganti) అనే క్యారెక్టర్లో కనిపించబోతోంది. ఏబీసీడీ(ABCD) ఫేమ్ సంజీవ్‌రెడ్డి(Sanjeev Reddy) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రాంత్(Vikranth) హీరోగా కనిపించనున్నాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా చాందిని చౌదరి తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో హాలో ఫ్రెండ్స్, సోషల్ మీడియాకి నేను కొన్ని రోజులు గ్యాప్ తీసుకుందాము అని అనుకుంటున్నాను. దానికి కారణం నాకు రెండు నెలల క్రితం తీవ్రమైన గాయం అయింది. అయితే దీనిపై నాకు అంతగా అవగాహన లేకపోవడంతో ఈ గాయం మరింత తీవ్రంగా మారింది. అయినప్పటికీ దీనిని నేను లెక్క చేయకుండా షూటింగ్స్‌లలో పాల్గొన్నాను. దీంతో ఈ గాయం నన్ను బెడ్‌కే పరిమితం చేసింది. ఇప్పుడు నాకు రెస్ట్ అవసరం అని డాక్టర్లు అన్నారు. కాబట్టి నేను కోలుకునే వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. అప్పటి వరకు చీర్స్ అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ వైరల్‌గా మారగా.. చాందినికి ఏమైంది అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.